అగ్రరాజ్యమైన అమెరికాలో బఠాణీలు దొరికినంత సింఫుల్ గా గన్లు లభిస్తూ ఉంటాయి. అంతేనా.. కాస్త బుర్రలో గుజ్జు ఉన్న వారైతే.. బజార్లో దొరికే సామాగ్రితో తమకు అవసరమైన గన్లను తయారు చేసుకునేలా వీలు అక్కడ ఉంటుంది. గన్ కల్చర్ విపరీతంగా ఉండే అమెరికాలో.. గడిచిన కొద్దికాలంగా తమ ఇష్టారాజ్య వినియోగానికి పలువురు తెగించటం.. దీంతో పలువురు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవటం తెలిసిందే.
ఇటీవల జరిగిన కాల్పుల్లో నిందితులు వినియోగించిన ఆయుధాల్ని చూస్తే.. వారు తమ సొంతంగా తయారు చేసుకున్నవే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికాలో గన్ కల్చర్ కు ముకుతాడు వేసేలా అడుగు వేసింది. ఎవరికి వారు ఆయుధాల్ని సమకూర్చుకునే అవకాశం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ‘గన్ వయలన్స్ పబ్లిక్ హెల్త్ ఎపడిమిక్’ పేరుతో బైడెన్ సర్కారు కీలక ఉత్తర్వుల్ని జారీ చేసింది.
తుపాకీ విడి భాగాల్ని ఇప్పటిమాదిరి స్వేచ్ఛా మార్కెట్ లో సింఫుల్ గా దొరికేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని బైడెన్ సర్కారు భావిస్తోంది. అంతేకాదు.. నేషనల్ ఫైర్ ఆర్మ్స్ చట్టం కిందకి పిస్టల్స్‌ని నియంత్రించాలని భావిస్తున్నారు. అయితే.. బైడెన్ సర్కారు తీసుకున్న చర్యల్ని చట్టంగా మారిస్తేనే ప్రయోజనం ఉంటుంది. మరి.. ఇందుకు రిపబ్లికన్లు మద్దతు ఇస్తారా? అన్నది సందేహమే. ఎందుకంటే.. ప్రభుత్వం చేస్తున్న పలు ప్రతిపాదనల విషయంలో విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ సర్కారు తాను అనుకున్నది చేస్తుందా? అన్నది అసలు ప్రశ్న. రిపబ్లికన్లతో పోలిస్తే.. తాజా బైడెన్ సర్కారు గన్ కల్చర్ కు షాకిచ్చేలా నిబంధనల్ని రూపొందించాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెప్పక తప్పదు.
This post was last modified on April 9, 2021 11:17 am
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…