Political News

రైలు ఎక్కే వారికి దిమ్మతిరిగే రూల్స్

కరోనా విపత్తును కట్టడి చేసేందుకు విధించన లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజారవాణా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మే 17తో లాక్‌డౌన్‌ -3 ముగిసిపోబోతోందన్న ఊహాగానాలకు ఊతమిస్తూ తాజాగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించింది. రైళ్ల సర్వీసులను క్రమంగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.

ఈ క్రమంలోనే దాదాపు నెలన్నర రోజులుగా స్టేషన్లకే పరిమితమైన రైళ్లు….మే 12 నుంచి పట్టాలెక్కబోతున్నాయి.15 జతల రైళ్లను (అప్‌ అండ్‌ డౌన్‌ కలిపి 30 రైళ్లు) రైల్వే శాఖ ప్రారంభించనుంది. మే 11న 4 గంటల నుంచి టికెట్ల బుకింగ్ ను ఐఆర్‌సీటీసీ‌ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

కేవలం ఐఆర్ సీటీసీ వెబ్ సైట్, యాప్ ద్వారా మాత్రమే బుక్ అయిన ఈ-టిక్కెట్లు కన్‌ఫర్మ్‌ అయిన వారిని మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో వసూలు చేస్తున్న ఛార్జీలనే.. ఇప్పుడు నడిపే ప్రత్యేక రైళ్లకు కూడా వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తామని, ప్రయాణికులంతా తప్పనిసరిగా స్క్రీనింగ్‌ చేయించుకోవాలని తెలిపింది.

ప్రయాణికులను రవాణా చేసే వాహనం డ్రైవర్‌కు అనుమతి ఉంటుందని తెలిపింది. స్టేషన్‌, కోచ్‌ ఎంట్రీ , ఎగ్జిట్ పాయింట్ల వద్ద హ్యాండ్‌ శానిటైజర్లు పెట్టాలని సూచించింది. ప్రయాణం సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందేనని సూచించింది. బోర్డింగ్‌, కోచ్‌లలో ప్రయాణిస్తున్న సమయంలో భౌతికదూరం పాటించాలని ప్రయాణికులకు సూచించింది.

ప్రయాణికుల కోసం ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్రచారం ద్వారా ఆరోగ్య సలహాలు, మార్గదర్శకాలు అందించాలంది. ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకున్నాక ఆ రాష్ట్రం సూచించిన ఆరోగ్య నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని హోంశాఖ తెలిపింది

రైలు ప్రయాణీకులకు కేంద్రం తాజా మార్గదర్శకాలివే

  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం
  • ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి
  • ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా టికెట్ల బుకింగ్‌కు అనుమతులు లేవు
  • 7 రోజుల ముందుస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతి
  • కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్లు మాత్రమే జారీ చేస్తారు
  • వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ టికెట్లు జారీ చేయరు
  • ఆన్‌లైన్లో మాత్రమే టికెట్లను క్యాన్సిల్ చేసుకునే అవకాశం
  • టికెట్‌ను 24గంటల ముందుగా రద్దు చేసుకోవాలి. 50% డబ్బు మాత్రమే తిరిగి చెల్లిస్తారు.
  • రైళ్లలో ప్రయాణికులకు ఆహార పదార్థాలను సరఫరా చేసే బాధ్యత ఐఆర్‌సీటీసీదే
  • క్యాటరింగ్‌ ఛార్జీలను టికెట్ల ధరలో కలపడంలేదు.
  • టికెట్ బుకింగ్ సమయంలోనే ఐఆర్‌సీటీసీలో ఆహారం బుక్‌ చేసుకునే సదుపాయం.
  • గతంలో రాజధాని రైళ్లలో కల్పించిన దుప్పట్లు, టవల్స్ సరఫరాను ఈ ప్రత్యేక రైళ్లలో ఇవ్వడం లేదు.

వీటితో పాటు

  • ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ పెట్టుకోవాలి
  • బ్లూటూత్ ఆన్ చేయాలి
  • ఇష్టారాజ్యంగా రైల్లో ఆ సీట్లో ఈ సూట్లో కూర్చోకూడదు. బాత్ రూమ్ కి తప్ప మరి దేనికీ వెళ్లకూడదు

This post was last modified on May 11, 2020 6:33 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

6 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

23 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

1 hour ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

2 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

3 hours ago