ఎస్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా… అధికార టీఆర్ఎస్‌లోనే ఇదే అంశంపై విస్తృతమైన చర్చలు నడుస్తున్నాయి. గత కొన్నేళ్లుగా తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా.. ఉప ఎన్నిక జరిగినా యువనేత, మంత్రి కేటీఆర్ హంగామానే కనపడేది. ఎన్నికల్లో కారు పార్టీ గెలుపులో కేటీఆర్ వ్యూహాలే కీలకంగా ఉండేవి. అయితే దుబ్బాక ఉప ఎన్నిక నుంచి ఆయన పాత్ర నామమాత్రమవుతోందా ?అన్న సందేహాలు ఉన్నాయి. దుబ్బాక మెదక్ జిల్లాలో ఉండడం..ఆ జిల్లా బాధ్యతలు ముందు నుంచి హరీష్ రావు చూస్తుండడంతో దుబ్బాకకు కేటీఆర్ దూరంగా ఉన్నారనుకున్నా… గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ ఆయనే అన్నీ తానై వ్యవహరించారు. అయితే ఈ రెండు ఎన్నికల్లోనూ ఫలితం కారు పార్టీకి అనుకూలంగా రాలేదు. పైగా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారం ప్రారంభమయ్యాక టీఆర్ఎస్ గ్రాఫ్ ఎంతో కొంత తగ్గుతూ వస్తోంది.
ఇక ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాలు పన్నితే కాని.. ఉత్కంఠ పోరులో ఆ పార్టీ గెలవకలేకపోయింది. ఇక ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరింది. దుబ్బాక, గ్రేటర్ దెబ్బతో ఉన్న టీఆర్ఎస్‌కు సాగర్లో గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే గత రెండు నెలలుగా టీఆర్ఎస్ కీలక నేతలు ఇక్కడ మకాం వేసి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో మండలాలు, గ్రామాల వారీగా పార్టీ కీలక నేతలకు కేసీఆరే స్వయంగా బాధ్యతలు అప్పగించారు.
కులాల వారీ ఓట్ల కొనుగోళ్లు కూడా చేస్తున్నారు. ఈ పోరులో మొత్తంగా చూస్తే కేటీఆర్ హవా ఎక్కడా కనపడడం లేదు. ఆయన ఈ నెల 9, 10 తేదీల్లో రోడ్ షోలు మాత్రం చేస్తున్నారు. అంతకు మించి వ్యూహరచన మాత్రంచేయడం లేదు. ఎన్నికల వ్యూహాలు అన్ని పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచార రంగంలోకి తాను కూడా స్వయంగా దిగుతున్నారు. ఈ నెల 14న హాలియాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతుండడంతో కేటీఆర్ రోడ్ షోలు రద్దయినట్టు పార్టీ నుంచి అధికార ప్రకటన రావడంతో పార్టీ వర్గాలు సైతం షాక్ తిన్నాయి.
ఇంత హోరాహోరీ ప్రచారం నడుస్తున్నా కేటీఆర్ హడావిడి సాగర్లో ఏ మాత్రం లేకపోవడంతో ఏం జరిగిందా ? అన్నది పార్టీ వర్గాలకు కూడా అంతు పట్టడం లేదు. ఏదేమైనా కేసీఆర్ ఇప్పటికిప్పుడు అయితే పూర్తిగా కేటీఆర్‌ను నమ్మి పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లో పెట్టేందుకు అయితే ఇష్టపడడం లేదనే తెలుస్తోంది.
This post was last modified on April 8, 2021 8:51 am
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…