గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు తమిళ కథానాయకుడు విజయ్. ఒకప్పుడు ఫాలోయింగ్, మార్కెట్ పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు దరిదాపుల్లో ఏ హీరో నిలిచేవాడు కాదు. కానీ విజయ్ వరుస బ్లాక్ బస్టర్లతో రజినీని మించి ఎదిగిపోయాడు. ఇప్పుడు తమిళనాట అతనే అతి పెద్ద స్టార్ అనడంలో మరో మాట లేదు. ఆ రాష్ట్రంలో ఇలాంటి ఫాలోయింగ్ సంపాదించిన ప్రతి కథానాయకుడి అంతిమ లక్ష్యం రాజకీయాలే అవుతుంటాయి.
రజినీ ఆరోగ్యం సహకరించక రాజకీయాల్లోకి రాలేదు కానీ.. లేదంటే ఈపాటికి ఎన్నికల్లో పోటీపడేవాడే. ఆయన సమకాలీనుడైన కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే కొన్నేళ్లలో విజయ్ కచ్చితంగా రాజకీయాల్లో అడుగు పెడతాడనే అంచనాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో అతను బరిలో ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశాలున్నట్లు తన సినిమాల ద్వారా చెప్పకనే చెబుతుంటాడు విజయ్.
సమకాలీన రాజకీయాల మీద తన సినిమాల ద్వారా విజయ్ కౌంటర్లు వేయడం గమనించవచ్చు. ‘మెర్శల్’ సినిమాలో జీఎస్టీ మీద పంచులు వేశాడు. ‘మాస్టర్’ సినిమాలోనూ పొలిటికల్ టచ్ ఉన్న డైలాగులు కొన్ని ఉన్నాయి. ఐతే సినిమాల ద్వారానే కాక.. బయట కూడా తన చర్యలతో పొలిటికల్ పంచులు వేయడానికి విజయ్ సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం తమిళనాట అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్నాయి. విజయ్ కూడా ఓటేయడానికి వచ్చాడు. ఈ సందర్భంగా అందరు సెలబ్రెటీల్లా కారు వాడకుండా సైకిల్ మీద ర్యాలీగా పోలింగ్ బూత్‌కు విజయ్ చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని నెలల్లో విపరీతంగా పెరిగిపోవడం, అది సామాన్యులపై ఎంతగానో ప్రభావం చూపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ చేయడమే ఉద్దేశంగా విజయ్ సైకిల్ మీద వచ్చాడనే చర్చ జరుగుతోంది. విజయ్ నోరు తెరిచి ఏమీ మాట్లాడుకుండానే.. పరోక్షంగా తాను అన్నాడీఎంకే-భాజపా కూటమికి తాను వ్యతిరేకమని, వాళ్లకు ఓటేయొద్దని అభిమానులకు చెప్పకనే చెప్పేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలింగ్ స్టేషన్ దగ్గర్లో ఉండటం.. ట్రాఫిక్, పార్కింగ్ లాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని విజయ్ సైకిల్ మీద వచ్చాడని అతడి సన్నిహిత వర్గాలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా.. జనాలు మాత్రం దీన్ని మరో దృష్టితోనే చూస్తున్నారు.
This post was last modified on April 6, 2021 5:18 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…