Political News

కేసీఆర్.. బీజేపీ మీద యుద్ధం.. వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారా?

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా త‌న ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్న బీజేపీ అగ్ర‌నేత‌లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షాల‌పై ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆయ‌న అనుస‌రిస్తున్న విధానాలు రాష్ట్రాల హ‌క్కుల‌కు విఘాతం క‌లిగిస్తున్నాయ‌ని, క‌నీస బాధ్య‌తల నుంచి కేంద్రం త‌ప్పుకొంటోంద‌ని కేసీఆర్‌, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటివారు ప్ర‌త్య‌క్షంగా ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రం నాటికి.. బీజేపీకి చెక్ పెట్టేలా వారు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన యుద్ధం ఎలా ప్రారంభించాలి? మోడీకి ఎలా చెక్ పెట్టాలి? అనేదే ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌.

ఈ క్ర‌మంలోనే.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ అంశం క‌లిసి వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. బీజేపీ అన్యాయం చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వ‌రుస‌లోఉంది. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టును ముందుకు సాగ‌నివ్వ‌డం లేదు. ఇత‌ర నిధులు సైతం ఇవ్వ‌డం లేదు. మ‌రి ఇంత అన్యాయం చేస్తున్నా.. ఇటు అధికార వైసీపీ కానీ అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకానీ, బీజేపీతో నే అంట‌కాగుతున్న జ‌న‌సేన కానీ, ప్ర‌శ్నించ‌డం లేదు. దీనికి ఎవ‌రికివారికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ప్ర‌ధానంగా వైసీపీని తీసుకుంటే.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై సీబీఐ కేసులు.. ఉన్నాయి. ఇక‌, చంద్ర‌బాబు ఇది లాజిక్ ప్రకారం పోరాడుతున్నారు. మోడీ తో పెద్దగా గొడవ పెట్టుకోవడానికి బాబుకు ఆసక్తి లేదు.

ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. పెయిడ్ బ్యాచ్ అనే ముంద్ర సంపాయించుకున్నారు. దీంతో రాజ‌కీయంగా బీజేపీని టార్గ‌టె్ చేసేందుకు ఈ ముగ్గురూ కూడా ఉత్సాహం చూపించ‌డం లేదు. ఒక్క మాట కూడా అన‌క‌పోగా.. అవ‌కాశం చూసుకుని మ‌ద్ద‌తుగా కూడా మాట్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ముగ్గురిలో ఎవ‌రూ కూడా ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తున్న దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డి కార్మికులు ఉద్యోగ సంఘాలు.. తెలంగాణ‌లోని మంత్రి కేటీఆర్‌ను క‌లిసి మొర‌పెట్టుకున్నాయి. చిత్రంగా.. ఇక్క‌డి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా.. మంత్రి కేటీఆర్‌ను క‌లిసి.. ఉక్కుపై పోరాడాల‌ని ఆహ్వానించారు.

దీనికి కేటీఆర్ సైతం ఓకేచెప్పారు.ఇక‌, ఇదే ప‌రిమాణాల‌ను సీఎం కేసీఆర్ సైతం నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. బీజేపీపై యుద్ధం చేసేందుకు ఇదే త‌గిన‌స‌మ‌యం అనుకుంటున్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బెంగాల్ సీఎం పిలుపునిచ్చిన‌ట్టు.. ప్ర‌త్యేక ఫ్రంట్ ఏర్ప‌డితే.. తాను అందులోకిచేరి.. కేటీఆర్‌ను సీఎంను చేసి.. బీజేపీకి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు చేయాల‌ని కేసీఆర్ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం.. బెంగాల్‌లో మ‌మ‌త మ‌ళ్లీ కొలువుదీరితే.. ఇక్క‌డ అప్ప‌టి నుంచి విశాఖ కేంద్రంగా బీజేపీపై యుద్ధం ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంటుంద‌ని అనుకుంటున్నారు.

దాదాపు ఐదు ల‌క్ష‌ల మందితో విశాఖ‌లో స‌భ నిర్వ‌హించింది. .. దీనికి బీజేపీని వ్య‌తిరేకించే రాష్ట్రాల సీఎంల‌ను మ‌మ‌త‌, కేజ్రీవాల్ స‌హా ప‌లువురిని ఆహ్వానించి.. తిరుగుబాటు జెండా ఎగ‌రవేస్తార‌ని తెలుస్తోంది. అంటే.. మొత్తంగా చూస్తే.. కేంద్రంలోని బీజేపీపై విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశాన్ని ఆలంబ‌నగా చేసుకుని కేసీఆర్ యుద్ధాన్ని మొద‌లు పెట్ట‌నున్నార‌న‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక్క‌డ ఇంకో విష‌యం కూడా చెప్పుకోవాలి. కేసీఆర్‌కు.. ఏపీలో మంచి క్రేజ్ ఉంది. రాష్ట్రాన్ని విడ‌గొట్టారానే ఆవేద‌న కాంగ్రెస్‌పై ఉంటే.. కేసీఆర్ వాక్చాతుర్యం.. ఆయ‌న మాట తీరుకు ఏపీ ప్ర‌జ‌లు ఫిదా అవుతున్నారు. సో.. కేసీఆర్ క‌నుక విశాఖ కేంద్రంగా యుద్ధం ప్రారంభిస్తే.. అది స‌క్సెస్ అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 6, 2021 7:23 am

Share
Show comments

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago