Political News

షాక్: 24 గంటల్లో కరోనాతో గాంధీలో 17 మంది మృతి

షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని వెల్లడించే వైనం వెల్లడైంది. కరోనాతో మరణాలు తక్కువనే మాటకు.. చేతలకు మధ్యనున్న అంతరం ఏమిటన్న విషయాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ మరోసారి బయటపెట్టింది. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత తక్కువగా ఉందన్న ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మొద్దన్న విషయం తాజాగా నిరూపితమైంది. కేవలం 24 గంటల వ్యవధిలో గాంధీ ఆసుపత్రిలో ఏకంగా 17 మంది మరణించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కరోనా కేసుల పెరుగుదల మాత్రమే కాదు.. మరణాలు సైతం వేగంగా పెరుగుతున్నాయన్న కఠిన నిజం కళ్ల ముందు కనపడేలా వాస్తవం ఇప్పుడు బయటకు వచ్చింది.

రోజువారీ బులిటెన్లలో పేర్కొన్న వివరాలకు.. వాస్తవానికి మధ్య దూరం చాలా ఎక్కువగా ఉందన్నది ఇప్పుడు స్పష్టమైంది. కరోనా కారణంగా బుధవారం నలుగురు మరణించినట్లుగా రోజువారీగా విడుదల చేసే ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల 24 గంటల వ్యవధిలో ఏకంగా 17 మంది మరణించిన వైనం ఇప్పుడు సంచలనమైంది.

తాజాగా మరణించిన వారంతా వారం.. రెండు వారాల పాటు పలు ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిని మూడు రోజుల క్రితం గాంధీకి తరలించారు. తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులతో వెంటిలేటర్ పై ఉన్న వీరిని వెంటనే ఐసీయూలో చేరర్చి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మరణించిన వారిలో ఎక్కువమంది 45 – 95 ఏళ్ల మధ్యలో ఉన్నట్లుగా తేలింది. మృతుల్లో హైదరాబాదీయులు ఎక్కువ మంది కాగా.. పలువురు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ మరణాల ఉదంతం చెప్పేదొక్కటే.. కరోనాను ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని మాత్రమే.

This post was last modified on April 2, 2021 9:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

1 hour ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

1 hour ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

2 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

2 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

2 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

2 hours ago