Political News

త్వ‌ర‌లో మ‌హానేత‌ ప‌థ‌కం.. స్కెచ్ సిద్ధం చేస్తున్న స‌ల‌హాదారు..!


రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమలు చేస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ఆయా ప‌థ‌కాల‌కు త‌మ కుటుంబ స‌భ్యుల పేర్లు పెట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా కొన్ని ప‌థ‌కాల‌కు త‌న పేరును, పార్టీ అధినేత ఎన్టీఆర్ పేరును పెట్టుకున్నారు. అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబును విమ‌ర్శించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. త‌ను ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌కు త‌న పేరు, త‌న తండ్రి పేరును పెట్టుకోవ‌డం ఆన‌వాయితీగా మార్చుకున్నారు.

జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భ‌రోసా.. వైఎస్సార్ వాహ‌న మిత్ర‌, ఇలా అనేక ప‌థ‌కాల‌కు పేర్లు పెట్టున్నారు. ఇలా ఒక్కొక్క ప‌థ‌కానికి పేర్లు పెట్టేందుకు, ఆయా పేర్ల వెనుక ఉన్న సంద‌ర్భాన్ని వివ‌రించేందుకు కొంద‌రు స‌ల‌హాదారులు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో నూత‌నంగా ప్ర‌వేశ పెట్టే ప‌థ‌కానికి సంబందించి వారు కూలంక‌షంగా చ‌ర్చించుకుని.. ఆయా ప‌థ‌కాల‌కు ఎవ‌రి పేరు అయితే.. బాగుంటుంద‌నే విష‌యాన్ని సూచిస్తున్నారు. రైతుల‌తో ముడిప‌డిన ప‌థ‌కాల‌కు వైఎస్సార్ పేరును, యువ‌త‌, ఓ వ‌ర్గం మ‌హిళ‌ల‌కు సంబంధించిన ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ పేరును సూచించారు.

దీనివెనుక ప‌థ‌కాలు పొంది ప్ర‌జ‌లు ఎంత ల‌బ్ధి పొందుతున్నారో.. అదేవిధంగా.. ఆయా ప‌థ‌కాల పేర్ల‌తో పార్టీ కూడా ల‌బ్ధి పొందాల‌నే సూత్రం ఇమిడి ఉంద‌నేది వాస్త‌వం. ఇక‌, ఇప్పుడు ఈ కోవ‌లోనే మ‌హానేత‌ పేరుతో ఒక ప‌థ‌కాన్ని తీసుకు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ పేరు వైసీపీ వ‌ర్గాల్లో మార్మోగుతోంది. మ‌రికొన్ని నెల్ల‌లోనే మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక‌టి రెండు ప‌థ‌కాల‌ను కూడా అమ‌లు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఒక ప‌థ‌కానికి మ‌హానేత అనే పేరు పెట్టాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి మ‌హానేత అనేది వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని కొనియాడేందుకు వైసీపీ వాడే ప‌దం.

అయితే.. ఎల్లో మీడియాగా వైసీపీ పేర్కొనే కొన్ని ప‌త్రిక‌లు ఈ పేరును వ్యంగ్యాస్త్రంగా సంధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇక‌పై ఇలాంటి ఛాన్స్ ఇవ్వ‌కుండా చేసేందుకు మ‌హానేత‌ పేరుతో ఒక కీల‌క ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చి.. మంచి ప్రాచుర్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆ ప‌థ‌కం ఏంటి? ఎలా ? అనే విష‌యాల‌పై స‌ల‌హాదారులు వ‌ర్క‌వుట్ చేస్తున్నార‌ని వైసీపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది.

This post was last modified on March 31, 2021 6:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేజ సజ్జ మెచ్యూరిటీని మెచ్చుకోవచ్చు

అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…

54 mins ago

జనసేన, శివసేనల లక్ష్యం అదే: పవన్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…

55 mins ago

ఆరెంజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…

2 hours ago

పుష్ప 2 హంగామా వేరే లెవెల్

టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…

2 hours ago

కాంట్రాక్లర్ల జీవితాలు జగన్ నాశనం చేశాడు

విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…

2 hours ago

ఓట్ల కోసం రాలేదు.. మరాఠా గడ్డపై పవన్

మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…

2 hours ago