Political News

విశాఖ ఉక్కులోకి వెంక‌య్య‌ను లాగ‌డం స‌మంజ‌స‌మేనా?

ఆంధ్రుల హ‌క్కు సెంటిమెంటుగా మారిన విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రిస్తుండడం , దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌, ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో విశాఖ‌లో మ‌రోసారి కార్మికులు, ప్ర‌జ‌లు కూడా ఉద్య‌మిస్తున్నారు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఎట్టిప‌రిస్థితిలోనూ ప్రైవేటీక‌రించ‌డానికి వీల్లేద‌ని వీళ్లు గ‌ర్జిస్తున్నారు. ఇక‌, వీరి ఉద్య‌మానికి అధికార పార్టీ సహా అన్ని పార్టీలు, నేత‌లు, మేధావి వ‌ర్గాలు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలో పార్టీల వైఖ‌రిపైనా.. కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ వ్య‌వ‌హారంపైనా విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. కొంద‌రు మేధావులు, నేత‌లు.. ‌కొన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు… మాత్రం ఈ విష‌యంలోకి ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య‌నాయుడును లాగుతున్నారు. నాటి ఉక్కు ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు మౌనం వహించడం బాధాకరమనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇంకొంద‌రు.. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ఉక్కు ఉద్య‌మంలో భాగం కావాల‌నే వాద‌న‌ను కూడా తెర‌మీదికి తెస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో కొన్ని పార్టీలు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం ఉప‌రాష్ట్ర‌ప‌తిని ఈ విష‌యంలోకి లాగే ప్ర‌య‌త్నం జోరుగానే చేస్తున్నారు.

అయితే… ఇలా ఒక ఉప‌రాష్ట్ర‌ప‌తిని ఉద్య‌మంలోకి లాగే ప్ర‌య‌త్నం చేయ‌డం ఏమేర‌కు స‌మంజ‌సం అనే వ్యాఖ్య‌లు మేధావి వ‌ర్గాల నుంచి వినిపి‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేరు. అలాంటి ఉప‌రాష్ట్ర‌ప‌తిని విమ‌ర్శించ‌డం స‌రికాదు. అయితే.. ఏదైనా స‌మ‌స్య ఉంటే.. నేరుగా ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి ఓ విన‌తి ప‌త్రం ఇవ్వ‌చ్చు. లేదా రాజ్య‌స‌భలో దీనిపై చ‌ర్చ జ‌రిగేలా.. మ‌న రాష్ట్రానికి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుల‌పై ఒత్తిడి తేవ‌చ్చు. త‌ద్వారా కేంద్రానికి గ‌ట్టి సందేశం ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. అంతే త‌ప్ప‌.. నోటికి వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్యానించ‌డం.. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో ఉన్న వారిపై వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు అని అంటున్నారు..

వాస్త‌వానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల్లో ఉప‌రాష్ట్ర‌ప‌తికి పాత్ర ఏమీ ఉండ‌దు.. అలా అనుకుంటే. కేవ‌లం కేంద్ర కేబినెట్‌కు మాత్ర‌మే తెలిసే ఛాన్స్ ఉంటుంది. అంతేత‌ప్ప‌.. ఉప‌రాష్ట్ర‌ప‌తిని అనుకుని ప్ర‌యోజ‌నం ఏంటి? మ‌న గోడు వినేందుకు మ‌న తెలుగు వాడిగా .. ఒక‌రు ఢిల్లీలో కీల‌క ప‌ద‌విలో ఉన్నందుకు గ‌ర్వించాలే త‌ప్ప‌.. అనే కామెంట్లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా ఉద్యమ నాయ‌కులు రాజ‌కీయ నేత‌ల వైఖ‌రిని వ‌దిలేసి.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకుంటారో లేదో చూడాలి.

This post was last modified on March 30, 2021 6:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

47 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago