తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు మాత్రమే బలవంతుడు. లేదంటే ఆయన అత్యంత బలహీనంగా కనిపిస్తారు. అధికారం లేకుంటే ఎవ్వరైనా అంతే అని కొట్టిపారేయడానికి లేదు. చంద్రబాబు వ్యవహారం వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలున్నాయి.
కరోనాకు భయపడో, ఇంకో కారణంతోనో ఆయన హైదరాబాద్‌కు పరిమితం అయిపోయారు. ఇక్కడి నుంచే జగన్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. వైజాగ్ గ్యాస్ లీక్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటిస్తే దాన్ని కూడా చంద్రబాబు విమర్శించడం విమర్శల పాలైంది. ఆయన ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఈ సమయంలో ఆయన సాధ్యమైనంత సైలెంటుగా ఉండటం మేలని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.
ఇదిలా ఉంటే.. ఈ ఖాలీ సమయాన్ని భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చంద్రబాబు అండ్ కో ఎంతగా పుష్ చేసే ప్రయత్నం చేసినా కూడా నారా లోకేష్ ఇప్పటిదాకా నాయకుడిగా ఎదగలేకపోయాడు. తెలుగుదేశం బలహీన పడటానికి లోకేష్ వైఫల్యం కూడా కారణమన్న అభిప్రాయం బలంగా ఉంది. తెదేపా భవిష్యత్తు పట్ల కూడా భయం నెలకొనడానికి లోకేష్ ఒక కారణం. ఐతే ఇప్పటిదాకా అతణ్ని నాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఐతే ఈ లాక్ డౌన్ టైంలో దొరికిన ఖాళీలో చంద్రబాబు కొడుకుపై దృష్టిపెట్టొచ్చు. 40 ఏళ్లకు పైగా సాగిన తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోని అనుభవాలు చెప్పొచ్చు. వివిధ సందర్భాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి ఎలా నిలిచింది.. ఎలా వ్యూహాలు పన్నింది.. ఇంకా అనేక అనుభవాల గురించి కొడుక్కి విశదీకరించి.. రాజకీయాల్లో కష్టనష్టాల గురించి లోకేష్‌కు అర్థమయ్యేలా చెప్పొచ్చు.
చంద్రబాబు అనుభవ పాఠాల కంటే లోకేష్‌కు రాజకీయ తరగతులు ఇంకేం అక్కర్లేదు. లోకేష్‌ను సరిగ్గా తీర్చిదిద్ది అతను కాస్త నిరూపించుకుంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేకూరుతుంది. తనకు గ్రౌండ్ లేని టైంలో రాజకీయాలు చేయడం మాని చంద్రబాబు కొడుకుపై దృష్టిసారిస్తే చాలా మంచిదనే చెప్పాలి.
This post was last modified on May 18, 2020 4:41 pm
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…
వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…
మాళవిక మోహనన్.. రీసెంట్ గా విడుదలైన తంగలన్ చిత్రంలో యాక్షన్ పాకుడు నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ…