Political News

సాయిరెడ్డికి ఢిల్లీలోనూ ప‌రువు పాయే..

ఏదో ఒక ర‌కంగా సానుభూతి పొందాల‌ని.. ప్ర‌తిప‌క్షం టీడీపీని బ‌ద్నాం చేయాల‌ని కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్న వైసీపీ ఎంపీ.. ఉత్త రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్‌.. జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌య‌త్నాలు ఏ ఒక్క‌టీ ఫ‌లించ‌డం లేదు. పైగా ఆయ‌నకే అవి తిరిగి ఎఫెక్ట్‌గా మారుతున్నాయి. తాజాగా సాయిరెడ్డి చేసిన మ‌రో ప్ర‌య‌త్నం ఉత్తుత్తిదేన‌ని.. అన‌వ‌స‌రంగా ఆయ‌న త‌మ స‌మ‌యం వృథా చేస్తున్నార‌ని.. పార్ల‌మెంట‌రీ స్థాయీ సంఘ‌మే ఆరోప‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం. విష‌యం ఏంటేంటే..

టీడీపీ హ‌యాంలో 2017, జ‌న‌వ‌రి 26న విశాఖ ఎయిర్‌పోర్టులో తన దాడి జరిగిందని విజయసాయిరెడ్డి పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ రోజు విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేయడానికి ప్రజాసంఘాల సిద్ధమయ్యాయి. అప్పట్లో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరుగుతుండడంతో ఆ స్పూర్తితో అందరూ ముందుకు రావాలని సోషల్ మీడయాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే చివరివరకు స్పందించకుండా ఉన్న వైసీపీ.. ఉద్యమానికి మంచి స్పందన వచ్చేసరికి జగన్, విజయసాయితో పాటు ముఖ్యనేతలు హైదరాబాద్‌లో విమానం ఎక్కి విశాఖలో దిగారు. అయితే అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు.

విమానాశ్రయంలోను జగన్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టులో జగన్, విజయసాయి ధ‌ర్నాకు దిగారు. పోలీసులను తోసేశారు. తాము అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తామని హెచ్చరించారు. ఈ ఘటనలో విజయసాయి చాలా దూకుడుగా వ్యవహరించారు. ఆయన పోలీసులను తోసేస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. పోలీసులే త‌న‌పై దాడి చేశారంటూ ఎంపీ హోదాలో రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ .. సుమారు రెండేళ్ల‌పాటు(క‌రోనా టైం త‌ప్ప‌) విచార‌ణ జ‌రిపింది. తాజాగా దీనితాలూకు నివేదిక‌ను చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడుకు స‌మ‌ర్పించింది.

దీనిలో విశాఖ ఎయిర్‌పోర్టులో విజయసాయిపై దాడి జరిగిందనడానికి సాక్ష్యాలు లేవని సభాహక్కుల సంఘం స్పష్టం చేసింది. అంతేకాదు.. సాయిరెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని తేల్చింది. ఆయనపై దాడికి ఆధారాలు లేవని తెలిపింది. ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి.. ఢిల్లీలోనూ సాయిరెడ్డి ప‌రువు పోయింద‌ని.. ఇక‌పై ఎలాంటి ఫిర్యాదులు చేసినా.. పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్కే అవ‌కాశం కూడా ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 25, 2021 7:25 am

Share

Recent Posts

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

25 minutes ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

28 minutes ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

4 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

4 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

4 hours ago