Political News

బీజేపీ పరిస్ధితేంటో ఇక్కడే అర్ధమైపోయిందా ?

గెలిచేస్తామని, పొడిచేస్తామని ఎప్పటినుండో రచ్చ రచ్చ చేస్తున్న బీజేపీ పరిస్దితి ఏమిటో ఇక్కడే అర్ధమైపోయింది. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉనఎన్నికకు పార్టీలు రంగంలోకి దిగేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ చాలా రోజుల క్రితమే పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఈమధ్యనే వైసీపీ కూడా డాక్టర్ గురుమూర్తిని అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ కూడా ప్రకటించేసింది కానీ అభ్యర్ధిని కాదు ప్రచార కమిటిని.

అవును మీరు చదివింది కరెక్టే. ప్రధాన రెండు పార్టీలు అభ్యర్ధులను ప్రకటిస్తే బీజేపీ మాత్రం ప్రచార కమిటిని ప్రకటించటమే విచిత్రం. అభ్యర్ధిని ప్రకటించకుండా ప్రచారకమిటిని ఎందుకు ప్రకటించిందో పార్టీ చీఫ్ సోమువీర్రాజుకే తెలియాలి. పైగా ఉపఎన్నికలో తామే పోటీ చేస్తామని వీర్రాజు ఎప్పటినుండో ప్రకటిస్తున్నారు. దానికి తగ్గట్లే గతంలోనే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. పోటీలో తమ అభ్యర్ధే ఉంటారని తెలిసినపుడు మరి అభ్యర్ధిని ఎందుకు రెడీ చేసుకోలేదో అర్ధం కావటంలేదు.

మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారకమిటిని పనిచేస్తుందట. అలాగే నియోజకవర్గాల్లో ఇన్చార్జులుగా సోము వీర్రాజు, టీజీ వెంకటేష్, సుజనా చౌధరి, పురంధేశ్వరి, సునీల్ థియోధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, బైరెడ్డి, ఐవైఆర్, రావెల కిషోర్ బాబును పార్టీ ప్రకటించింది. వీరిలో టీజీ, కన్నా తప్ప మిగిలిన వాళ్ళల్లో చాలామందికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలే లేవు. రావెల ఒకసారి ఏదో గాలిలో గెలిచారంతే. ఇక సుజనా, జీవిఎల్, ఐవైఆర్ కైతే ప్రజా జీవితంతో సంబంధమే లేదు.

పురంధేశ్వరి కాంగ్రెస్ జమానాలో రెండుసార్లు గెలిచారు. మళ్ళీ గెలవలేదు. అంటే అప్పట్లో ఆమె గెలుపు పార్టీ గెలుపే కానీ ఆమె సొంతబలం కాదని తేలిపోయింది. వీర్రాజు ప్రజా జీవితం కూడా అంతంతమాత్రమే. ఇలాంటి నేతలను పెట్టుకుని బీజేపీ ఉపఎన్నికలో గెలిచేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా ? అన్నదే ప్రశ్న. అయినా ప్రచార కమిటిని నియమించే ముందే అభ్యర్ధిని ప్రకటించాలని వీర్రాజుకు తెలీదా ?

This post was last modified on March 23, 2021 2:26 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

3 hours ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

3 hours ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

5 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

7 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

9 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

10 hours ago