జనసేన కన్ఫ్యూజన్ మామూలుగా లేదు. ఏ విషయంలో ఎలా వ్యవహరించాలి? స్టాండ్ ఏమిటన్న విషయంలో వారిలో స్పష్టత మిస్ అవుతోంది. ఈ తీరు ఆ పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు..ప్రజల్లో చులకన చేసేలా చేస్తోంది. తాజా ఉదంతం కూడా దీనికి నిదర్శనం. ఓపక్క బీజేపీతో మిత్రత్వం.. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలన్ని ఏపీకి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి పార్టీతో అంటకాగటంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా.. కలిసి ప్రయాణించే తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మిత్రపక్షంతో ఎలా వ్యవహరించాలన్న అంశంపై సరైన క్లారిటీ లేని ఆ పార్టీకి.. పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఏమ్మెల్యే డెవలప్ మెంట్ అంటూ అధికారపార్టీలోకి జంప్ కావటం తెలిసిందే. ఆ నేత విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఏటూ తేల్చుకోలేకపోతోంది. ఓవైపు మాట కాదని వెళ్లిపోయిన రాపాకను లైట్ తీసుకోవాలని అనుకుంటూనే.. మరోవైపు పార్టీలోకి వచ్చే విషయం గురించి ఆలోచించుకోవాలని కోరటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు పార్టీలో పవన్ తర్వాత కనిపించే ఏకైక కీలక నేత నాదెండ్ల మనోహర్ హాజరై ప్రసంగించారు. యధావిధిగా జగన్ సర్కారుపై విమర్శలు చేసిన ఆయన.. రాపాక విషయాన్ని ప్రస్తావించారు. జనసేన నునంచి బయటకు ఎందుకు వెళ్లారో తమకు ఇప్పటికి అర్థం కాలేదన్న ఆయన.. ఏం ఆశించి వెళ్లారన్న ప్రశ్నను సంధించారు.
రాజోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే కానీ.. ఇన్ ఛార్జ్ కానీ లేకున్నా.. జనసైనికులు తమ సత్తా చాటారన్నారు. ఎంతో నమ్మకంతో జనసైనికులు పని చేస్తే వారిని మోసం చేసి వెళ్లిపోయిన రాపాకకు అధికార పార్టీలో ఎలాంటి గౌరవం లభిస్తుందో తెలీయటం లేదన్నారు. రాపాకపై పవన్ కు ఎంతో గౌరవం ఉందని.. మరోసారి ఆలోచించి జనసేనలోకి రావాలని కోరారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతను వదిలేయాల్సింది పోయి.. మళ్లీ వచ్చేందుకు ఆలోచించుకోవాలని పిలవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఓవైపు వేదిక మీద నుంచి రాపాకను పార్టీలోకి రావాలని నాదెండ్ల మనోహర్ కోరితే.. ఇంకోపక్క ఇదే సభలో ‘బహిరంగ సభకు రాపాకకు ప్రవేశం లేదు’ అంటూ మీ పల్లకి మోసిన రాజోలు జనసైనికులు అంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. అంతేకాదు.. నో ఎంట్రీ అన్న గుర్తులు ఫ్లెక్సీలో స్పష్టంగా ముద్రించారు. ఓవైపు ప్రవేశం లేదంటూ ఫ్లెక్సీలు పెట్టి.. మరోవైపు రాపాక మళ్లీ వచ్చే విషయం మీద ఆలోచించుకోవాలనే పిలుపు చూస్తే.. ఇంతటి కన్ఫ్యూజన్ జనసేన పార్టీలో తప్పించి మరే పార్టీలో ఉండదన్న భావన కలుగక మానదు.
This post was last modified on March 23, 2021 12:58 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…