తమిళనాడు ఎన్నికల్లో పెద్దపార్టీలు వణికిపోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పెద్దపార్టీలంటే కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. అవేమిటంటే అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షమై డీఎంకే. రాష్ట్రంలో చిన్నా చితక పార్టీలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలను తీసేస్తే మిగిలినవన్నీ ప్రాంతీయపార్టీలే.
అయితే వీటికి ఎన్నికల సమయంలో ఉపప్రాంతీయ పార్టీలు కూడా గట్టిపోటీ ఇస్తుంటాయి. ఉపప్రాంతీయ పార్టీలంటే కేవలం కొన్ని జిల్లాలకు లేదా రాష్ట్రంలోని ఏదో ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పార్టీలన్నమట. డీఎండీకే, ఎండికే, పీఎంకే, ఏఎంఎంకే, ఐజెకే, ఎస్ఎంకే లాంటి పార్టీలు చాలా ఉన్నాయి. తమిళనాడులో ఎన్ని పార్టీలున్నాయో చెప్పమంటే బుర్ర గోక్కోవాల్సిందే. అలాంటి పార్టీలను చూసి అన్నాడీఎంకే, డీఎంకేలే వణికిపోతున్నాయి.
ఇంత పరిస్దితి ఎందుకు వచ్చిందంటే తమ విజయావకాశాలను చిన్నపార్టీలు ఎక్కడ దెబ్బతీస్తాయో అని భయపడుతున్నాయి. చిన్న పార్టీలకు తమ ప్రాంతాల్లో గట్టిపట్టుంది. 2016 సాధారణ ఎన్నికల్ల అయినా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో అయినా పైన చెప్పిన రెండు పెద్దపార్టీలను వణికించేశాయి చిన్నపార్టీలు. అతికష్టం మీద 2, 3 వేల మెజారిటితో బయటపడ్డాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్ధులు ఓడిపోవటంలో చిన్నపార్టీల ప్రభావమే ఎక్కువ.
ఇపుడు కూడా అలాంటి పరిస్ధితే ఉందని పెద్దపార్టీలు భయపడుతున్నాయి. ఎందుకంటే పెద్దపార్టీల్లో కరుణానిధి కానీ జయలలిత కానీ లేరు. వాళ్ళిద్దరు లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలివే. అంటే ఎలాంటి గాలి కానీ సానుభూతి కానీ లేకుండా జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రాభల్యం మీదే గెలుపోటములు ఆధారపడుంటాయి. ఇలాంటి పరిస్ధితుల్లో చిన్నా, చితకా పార్టీల అభ్యర్ధులు గనుక గట్టిగా పనిచేస్తే దాని ప్రభావం పెద్దపార్టీల అభ్యర్ధుల మీద పడటం ఖాయం.
ఈ విషయాలపై పూర్తి అవగాహన ఉంది కాబట్టే డీఎంకే చీఫ్ స్టాలిన్+అన్నీడీఎంకే అధినేత, ముఖ్యమంత్రి పళనిస్వామి చిన్నపార్టీల అభ్యర్ధులను మచ్చిక చేసుకోవటంలో బిజీగా ఉన్నారట. చిన్నా, చితకా పార్టీలు కాకుండా ఓ మోస్తరు ప్రభావం చూపగలవని అనుకుంటున్న విజయకాంత్ పార్టీ డీఎండీకే, కమలహాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యుం, దినకరన్ పార్టీలు ఎవరి విజయావకాశాలను దెబ్బ తీస్తాయో తెలీక పెద్దపార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఐదుకూటములు పోటీ చేస్తున్నాయట. అంటే చివరకు ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోయేట్లున్నారు. చూద్దాం ఎవరిని ఎవరు దెబ్బ తీస్తారో.
This post was last modified on March 22, 2021 6:22 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…