తిరుపతి ఎన్నికల వేళ.. వైసీపీలో సెగ పుడుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ గెలుపుతమదేనని.. దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా మెజారిటీ దక్కించుకోవాలని.. వైసీపీ అధినేత జగన్ తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి 24 గంటలు కూడా గడవక పోవడంతో తిరుపతి వైసీపీలో కలకలం రేగింది. దీనికి ప్రధాన కారణం.. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలే. తిరుపతిని రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగినా.. రాయలసీమకు ప్రత్యేక గుర్తింపు లేకుండా పోయిందన్న ఆయన.. తిరుపతిని రెండో రాజధానిగా మార్చాలన్నారు.
వాస్తవానికి ఈ డిమాండ్ ఇప్పటిది కాదని చెప్పిన చింతా.. రాష్ట్ర విభజన సమయంలోనే తాను ఈ ప్రతిపాద న చేశానని. దీనికి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఓకే చెప్పారని.. దీనికి సంబంధించిన వివరాలను తాను అప్పట్లోనే ప్రధానికి అందించానని.. అయితే.. తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన మరు గున పడిపోయిందన్నారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ దీనిపై క్లా రిటీ ఇవ్వాలని.. డిమాండ్ చేయడం గమనార్హం. అంతేకాదు.. తాను ఈ నినాదాన్ని తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తానని చెప్పారు.
ప్రస్తుతం చింతా వ్యాఖ్యలు తిరుపతి రాజకీయ వర్గాల్లో ప్రభావం చూపుతాయని అంటున్నారు పరిశీలకు లు. రెండో రాజధాని విషయంపై ఇక్కడి ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారని చింతా చెప్పడం.. గెలుపు ఏకపక్షం అవుతుందని వైసీపీ నాయకులు అంచనావేసుకోవడం వంటి నేపథ్యంలో రాజధాని సెంటిమెంటు కనుక వర్కవుట్ అయితే.. వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురు కావడం తథ్యమనే అంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ వైసీపీ చేసిన అభివృద్ధి కూడా ఏమీలేదు.
నేతలు ఉన్నప్పటికీ.. ఒక రోడ్డు కూడా వేయలేదు. ప్రతిపక్షాల మాటగా చెప్పాలంటే.. ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. దీనిని బట్టి.. తిరుపతి ప్రజల్లో ఇప్పుడు ఈ అంసతృప్తికితోడు.. రెండో రాజధాని విషయం కనుక రాజుకుంటే.. వైసీపీకి ఆశించిన విధంగా విజయం దక్కకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 21, 2021 1:44 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…