ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగటం.. కొత్త ఛైర్మన్లు.. మేయర్లు వచ్చేయటం తెలిసిందే. మొత్తం 11 మేయర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పది చోట్ల పూర్తిగా కొత్తవాళ్లే మేయర్లుగా ఎన్నిక కావటం సంచలనంగా మారింది. ఎలాంటి రాజకీయ నేపథ్యంలో లేని వారికి మేయర్ పదవిని కట్టబెట్టటం ద్వారా జగన్ తనదైన ముద్రను వేయటమే కాదు.. కొత్త నాయకత్వానికి తెర తీశారు. కొత్తగా మేయర్ పదవుల్ని చేపట్టిన వారిలో అత్యధికులు సామాన్య జీవితాన్ని గడిపేవారు అయితే.. కొందరి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు సాగుతున్న రాజకీయానికి పూర్తి భిన్నమైన రాజకీయాన్ని ప్రదర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
అనంతపురం మేయర్ గా ఎన్నికైన వసీం సంగతే తీసుకోండి. అతగాడికి ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. కాకుంటే.. వసీం తండ్రి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి సహోధ్యాయి. పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా.. ఎమ్మెల్యే ప్రోత్సాహంతో కార్పొరేటర్ గా బరిలోకి దిగి.. ఏకంగా మేయర్ అయిపోయారు. చిత్తూరు మేయర్ అముద గురించి తెలిస్తే మరింత ఆశ్చర్యపోవాలి. పదో తరగతి వరకు చదివిన ఆమె.. ఒంటరిగా జీవిస్తున్నారు. ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్ చెప్పి బతుకు బండి లాగిస్తున్నారు. ఆమె ఇంటి పక్కనే ఉండే సోదరుడు ఆమెకు అండగా ఉంటున్నారు. అలాంటి ఆమె ఇప్పుడు చిత్తూరు మేయర్ గా మారిపోయారు.
తిరుపతి మేయర్ కూడా రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆమె కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. మేయర్ గా ఎన్నికైన శిరీష.. ఆమె భర్త తిరుపతిలో వైద్యులుగా పని చేస్తున్నారు. ప్రైవేటుఆసుపత్రి నిర్వహిస్తున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మద్దతుతో కార్పొరేటర్ గా బరిలోకి దిగిన ఆమె..ఇప్పుడు ఏకంగా నగరానికే ప్రథమ పౌరురాలిగా మారిపోయారు. విజయనగరం మేయర్ విజయలక్ష్మిది కూడా సాదాసీదా జీవనమే. ఆమె భర్త స్థానిక ఎమ్మెల్యే కంపెనీలో ఉద్యోగి. స్థానిక పరిణామాల నేపథ్యంలో ఆమెకు మేయర్ పదవి దక్కింది. ఇలా పలువురు మేయర్లను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. కొత్తగా పదవులు ఇచ్చి అందలం ఎక్కించటం ద్వారా.. జగన్ తన మార్కును ప్రదర్శించారని చెప్పాలి.
This post was last modified on March 19, 2021 3:07 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…