ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి దగ్గర్లో చోటు చేసుకున్న ఆరాచకం గురించి తెలుసుకున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంత భారీగా ఇలాంటి భాగోతాలు నడుస్తున్నాయా? అని విస్మయానికి గురి అవుతున్నారు. హైదరాబాద్ శివారులో జరిగే రేవ్ పార్టీలకుమించిన రేవ్ పార్టీ తాజాగా యాదాద్రిలో జరగటం.. దాన్నిపోలీసులు భగ్నం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
సంస్థాన్ నారాయణపూర్ లోని ఒక ఫాంహౌస్ లో భారీ ఎత్తున రేవ్ పార్టీకి ప్లాన్ చేశారు. జక్కిడి ధన్వంతరెుడ్డి అనే వ్యక్తికి చెందిన ఈ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీగా అతిధులు హాజరయ్యారు. ఇరవై కార్లు.. అరవై బైకులు పోలీసులకే దొరికాయంటే.. వాస్తవానికి మరెన్ని అక్కడకు వెళ్లి ఉంటాయన్నది అర్థం చేసుకోవచ్చు.
పక్కాగా అందిన సమాచారంతో రేవ్ పార్టీని భగ్నం చేసేందుకు డీసీపీ నారాయణరెడ్డి.. ఏసీపీ సత్తయ్యలు టీంలు పక్కాగా ప్లాన్ చేశాయి. రేవ్ పార్టీకి వచ్చిన 90 మంది యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి లాంటి చోట నిర్వహించిన రేవ్ పార్టీకి ఇంత భారీగా హాజరు కావటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీని వెనుక ఎవరు ఉన్నారన్న అంశంపై పోలీసులు లోతుడా విచారణ జరుపుతున్నారు. పార్టీలో భాగంగా పెద్ద ఎత్తున మద్యం.. డ్రగ్స్ తో పాటు.. అమ్మాయిలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ పార్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
This post was last modified on March 12, 2021 10:41 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…