సినీ.. రాజకీయ రంగాల్లో సుపరిచితుడు.. భోళా మనిషి ఏలూరు మాజీ ఎంపీకి పెద్ద కష్టమే వచ్చింది. ఎదిగిన కొడుకు అనారోగ్యానికి గురి కావటమే కాదు.. తాజాగా మరణించిన వైనం ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది. టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (37) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన్ను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వేళ.. పరిస్థితి విషమించటంతో ఆదివారం రాత్రి మరణించారు. రాంజీ అనారోగ్యానికి కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. వాస్తవానికి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు స్పందించలేదు. టీడీపీ యువనేతగా కొనసాగుతున్న రాంజీ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాడు. వారం క్రితం కూడా రాంజీ ట్విటర్ లో పోస్టులు చేశారు. అలాంటి యువనేత.. అకస్మాత్తుగా మరణించటాన్ని పార్టీవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇదిలా ఉంటే.. రాంజీ శరీర అవయువాల్ని దానం చేయటానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రాంజీ భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఏలూరులోని వారింటికి తీసుకెళ్లనున్నారు. దీంతో మాగంటి బాబు కుటుంబం తీవ్ర విషాదంలో చిక్కుకుంది. ఆయనకు రాజకీయ.. సినీ రంగానికి చెందిన పలువురు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇలాంటి కష్టం మరెవరికీ రావొద్దని కోరుకుంటున్నారు. అతడి మరణంపై పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒక క్రియాశీలక.. ఎంతో భవిష్యత్తు ఉన్న యువనాయకుడ్ని పార్టీ కోల్పోయింది. ఆయన మరణానికి అశ్రునివాళి ఘటిస్తున్నామని టీడీపీ ట్విటర్ లో పోస్టు చేయగా.. పార్టీముఖ్యనేత నారా లోకేశ్ సైతం ట్వీట్ చేశారు. లోకేశ్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక వినబడదు.. మాగంటి రాంజీ మనకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలుగుదేశానికి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడా.. నీ మరణం పార్టీకి.. నాకు తీరని లోటు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
This post was last modified on March 8, 2021 11:54 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…