2019 ఎన్నికల్లో జనసేనతో జట్టు కట్టిన కమ్యూనిస్టులు.. చిత్తుగా ఓడిపోయారు. కనీసం ఒక్కస్థానంలోనూ వారు విజయం సాధిం చలేక పోయారు. తమకు పట్టున్న ప్రాంతాలను కూడా పోగొట్టుకుని చేతులు కాల్చుకున్నారు. ఇక, 2014లోనూ వారు అప్పటి సమైక్య ఆంధ్ర పార్టీ నేత, అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీతో జట్టుకట్టి ముందుకు సాగారు. అయితే.. అప్పట్లోనూ వారు విఫలమయ్యారు. అయితే.. దీనికి ముందు జరిగిన ఎన్నికల్లో మాత్రం టీడీపీతో జట్టు కట్టి ఉమ్మడి ఏపీలో నాలుగు స్తానాలు కైవసం చేసుకుని అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ పరిణామాలను బట్టి.. వారికి బలమైన.. నమ్మదగిన మిత్రపక్షం ఏదైనా ఉంటే అది టీడీపీనే అని చాలా కాలం తర్వాత మళ్లీ అర్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది.
మరీముఖ్యంగా ఈ విషయంలో సీపీఎం కంటే.. సీపీఐ నేతలు ముందున్నారు. అందుకే వారు తాజాగా జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి తిరుగుతున్నారు. చాలా స్థానాల్లో టీడీపీకి మద్దతిస్తూ.. మరికొన్ని చోట్ల వారు కూడా పోటీ చేస్తున్నారు. ఇక, ఎన్నికల్లోనూ సీపీఐకి టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి సీపీఐ నేతలు పోటీ చేస్తున్నారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు ను పోలీసులు అడ్డగించినప్పుడు కూడా సీపీఐ బాగానే స్పందించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి… రామకృష్ణ.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకుంటారా? ప‌్రజాస్వామ్యం లేదా? అని నిలదీశారు. దీనిని బట్టి.. టీడీపీతో సీపీఐ బంధం ఏర్పరుచుకుందనే విషయం స్పష్టమవుతోంది.
ఇక, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సీపీఐ బలంగా ఉన్న చోట.. టీడీపీ ఆ స్థానాలను ఆ పార్టీకే వదిలేసింది. ఇలా విజయవాడలో ఆరు, విశాఖలో దాదాపు పది స్థానాలను, తిరుపతిలో నాలుగు చోట్ల సీపీఐకి టీడీపీ సపోర్టు చేస్తుండడం గమనార్హం. ఇదే బంధం వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో రెండు పార్టీలను నమ్ముకుని చేతులు కలిపినా.. సీపీఐకి ఏమీ ఒరిగింది లేదు. కానీ, టీడీపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుని ముందుకు సాగినా.. ఆ పార్టీ బలపడుతూనే ఉంది. ఇక, ఇప్పుడు కూడా అదే ఫార్ములాను కామ్రెడ్స్ అవలంబిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. అయితే.. దీనికి సంబంధించి అటు టీడీపీ, ఇటు సీపీఐ అగ్రనాయకులు మౌనంగా ఉండడం గమనార్హం.
This post was last modified on March 7, 2021 5:02 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…