సినిమాటిక్ గా కనిపించొచ్చు. లెక్క అంటే లెక్కగా ఉండటం అన్ని చోట్ల.. అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ.. తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నం. మిగిలిన రాష్ట్రాల్లోని తీరుతో ఏ మాత్రం సంబంధం లేకుండా తమదైన పద్దతిలో టికెట్ల ఎంపికను పూర్తి చేస్తాయి. ఎక్కడి దాకానో ఎందుకు? మన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ టికెట్లను ఎలా ఫైనల్ చేస్తాయో అందరికి తెలిసిందే.
అధినేత ఎవరు పేరు ఫైనల్ చేస్తే వారే పార్టీ తరఫున బరిలోకి దిగుతారు. తమిళనాడులోనూ అలాంటిదే ఉంటుంది. కానీ.. అంతకు ముందు కాస్త భిన్నమైన పద్దతిని అక్కడ అనుసరిస్తారు. పార్టీ టికెట్ కావాల్సిన వారు.. ఎవరైనా సరే పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలి. అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర సీన్ ఒకటి చోటు చేసుకుంది.
చెన్నై మహానగరంలోని చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్. ఇతడెవరంటారా? ఇంకెవరు డీఎంకే అధినేత స్టాలిన్ ముద్దుల కొడుకు. అయితే.. మాత్రం పార్టీ టికెట్ కావాలంటే డీఎంకే ఆఫీసుకు వచ్చి.. పార్టీ ఎన్నికల టీంను కలిసి.. సంప్రదాయపద్దతిలో టికెట్ కోరాలి. వారు చేసే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. తాజాగా స్టాలిన్ కుమారుడు సైతం ఇదే తీరిలో పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటానికి సీటును ఆశిస్తున్న కొడుకును పార్టీ నేతల ముందు ఇంటర్వ్యూ నిర్వహించారు స్టాలిన్. సీరియస్ గా కాకున్నా.. సంప్రదాయానికి అనుగుణంగాసాగిన ఇంటర్వ్యూ మొత్తాన్ని పార్టీ నేతలంతా ఆసక్తిగా తిలకించారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మొత్తం సీన్ కాస్తంత సినిమాటిక్ గా ఉండొచ్చు. కానీ.. అధినేత ఎక్కడో రిమోట్ ప్లేస్ లో ఉండి.. ఎవరి పేరు ముందు టిక్ కొట్టి.. వారి పేరును డిసైడ్ చేసే దానితో పోలిస్తే..తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలు కొన్ని అనుసరించే ఈ విధానం కాస్త బెటర్ గా అనిపించట్లేదు?
This post was last modified on March 7, 2021 10:49 am
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…