అధికార వైసీపీకి ఇదంతా అవసరమా ? అనే డౌటు పెరిగిపోతోంది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సందర్భంగా కొన్ని చోట్ల పెద్ద వివాదాలు రేగాయి. వివాదాల్లో ముఖ్యమైనది ఏమిటంటే ప్రతిపక్షాల తరపున పోటీ చేయాలని అనుకున్న కొందరు అభ్యర్ధుల సంతకాలను ఫోర్జరీలు చేసి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పటమే. పోటీకి సిద్దమైన తమ నామినేషన్లు తమకు తెలియకుండానే విత్ డ్రా అయినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించటంతో కొందరు అభ్యర్ధులు విస్తుపోయారు.
తిరుపతి కార్పొరేషన్లో 6వ డివిజన్ లో టీడీపీ అభ్యర్ధి విజయలక్ష్మి, 42వ డివిజన్లో బీజేపీ అభ్యర్ధి నరసింహయాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు అధికారులు చెప్పారు. అయితే అధికారుల ప్రకటన విని పై ఇద్దరు అభ్యర్ధులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరు పోటికి రెడీ అయిపోయారు. కాబట్టి విత్ డ్రా అనే ముచ్చటకు అవకాశం లేదు. మరి తమకు తెలియకుండానే తమ నామినేషన్లు ఎలా విత్ డ్రా అయ్యాయని విస్తుపోయారు.
ఇదే విషయమై వాళ్ళతో పాటు వాళ్ళ పార్టీల నేతలు పెద్ద గోల చేశారు. కలెక్టర్ తో ఒకటికి పదిసార్లు మాట్లాడారు. చివరకు వీళ్ళ వాదన విన్నతర్వాత వాళ్ళ సంతకాలన్నింటినీ సరిపోల్చుకుని విత్ డ్రాయల్ తో వీళ్ళకు సంబంధం లేదని రిటర్నింగ్ అధికారి నిర్ధారణ చేసుకున్నారు. దాంతో వాళ్ళు పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. అధికారపార్టీ నేతల ధౌర్జన్యాలకు ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి రాష్ట్రంలో ఇంకొన్ని చోట్లా జరిగినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.
ఇక్కడ గమనించాల్సిందేమంటే మాచర్ల, పుంగనూరు, జమ్మలమడుగు, పులివెందుల, పిడుగురాళ్ళ లాంటి అనేక మున్సిపాలిటి వార్డుల్లో టీడీపీ తరపున కానీ లేకపోతే ఇతర పార్టీల తరపున ఒక్క నామినేషన్ కూడా పడలేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలకు చేవ చచ్చిపోయిందా అనే అనుమానలు పెరిగిపోతున్నాయి. లేకపోతే వైసీపీ ధౌర్జన్యాల కారణంగానే ప్రతిపక్షాల నేతలు నామినేషన్లు వేయలేకపోయారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్నది చూస్తుంటే రెండో కారణమే నిజమనిపిస్తోంది.
ఇక్కడే అందరికీ వస్తున్న సందేహం ఏమిటంటే అధికారపార్టీ నేతలు ఇన్ని ధౌర్జన్యాలు చేయాల్సిన అవసరం ఉందా అని. ఎందుకంటే స్ధానికసంస్ధలంటేనే అధికారపార్టీకి అనుకూలంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎలాగూ తమకే గెలుచుకునే అవకాశం ఉన్నపుడు నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ? చివరకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధుల సంతకాలు కూడా ఫోర్జరీలు చేయాల్సిన అవసరం ఉందా ? అన్నదే అర్ధం కావటంలేదు.
This post was last modified on March 5, 2021 4:54 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…