Political News

కమలే సీఎం క్యాండిడేట్.. ఎమ్మెల్యేగా లారెన్స్ పోటీ

తమిళనాట రాజకీయాన్ని మారుస్తానని, ప్రజలకు కొత్త ఆశాజ్యోతిని అవుతానని అంటూ రాజకీయారంగేట్రం చేశారు లోకనాయకుడు కమల్ హాసన్. ఒకప్పుడు తాను రాజకీయాల్లో రానంటే రానని ఖరాఖండిగా చెప్పిన ఆయన.. జయలలిత మరణానంతరం మనసు మార్చుకున్నారు. కరుణానిధి శకం కూడా ముగిసినట్లే అని అర్థం చేసుకుని తమిళనాట నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఆయన రంగంలోకి దిగారు. మక్కల్ నీదిమయం పేరుతో మూడేళ్ల కిందటే ఆయన పార్టీ అనౌన్స్ చేశారు.

రెండేళ్ల కిందట లోక్‌సభ ఎన్నికల్లోనూ తన పార్టీని బరిలో నిలిపారు. అక్కడ ఆశించిన ఫలితాలు రాకపోయినా.. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తూ వచ్చారు. గత కొన్ని నెలలుగా క్షేత్ర స్థాయిలోకి దిగి చాలా సీరియస్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన విధానాలు నచ్చి కొన్ని పార్టీలు మక్కల్ నీదిమయంతో జట్టు కట్డడానికి ముందుకొచ్చాయి. అందులో ఒకటి.. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి (ఏఐఎస్ఎంకే).

సీనియర్ నటుడు శరత్ కుమార్ కొన్నేళ్ల కిందట మొదలుపెట్టి పార్టీనే ఏఐఎస్ఎంకే. దీంతో పాటుగా ద్రవిడ భావజాలం ఉన్న ఐజేకే అనే మరో పార్టీ కూడా కమల్ పార్టీతో చేతులు కలిపింది. ఈ పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌ హాసన్‌ను ప్రకటించారు. ఈ ప్రకటన చేసింది శరత్ కుమారే కావడం విశేషం.

మరో విశేషం ఏంటంటే.. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ శరత్ కుమార్ పార్టీ తరఫున రాధాపురం అనే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు శరత్ వెల్లడించాడు. అలాగే తన భార్య, పార్టీ ప్రధాన కార్యదర్శి రాధిక.. కోవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తుందన్నారు. తమ కూటమి ఇంకా ఇంకా బలపడుతుందని, ఎన్నికల్లో ఎంతో ప్రభావం చూపిస్తుందని, మంచి ఫలితాలు రాబడుతుందని శరత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాట ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రధానంగా డీఎంకే-కాంగ్రెస్, అన్నాడీఎంకే మధ్య పోటీ నెలకొంది. డీఎంకే-కాంగ్రెస్ కూటమికే విజయావకాశాలు ఎక్కువని రాజకీయ పండితులు అంటున్నారు.

This post was last modified on March 4, 2021 5:40 pm

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

36 minutes ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

1 hour ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

1 hour ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago