నారా లోకేశ్… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆ పార్టీ ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా తనదైన శైలి దూకుడును ప్రదర్శించినా… ఆయనలో ప్రత్యర్థి వర్గంపై విరుచుకుపడే తత్వం ఏమాత్రం పెరగలేదని నిన్నటిదాకా చాలా మంది అనుకునే వారు. అయితే వజ్రాన్ని సానబెట్టిన తీరున క్రమంగా లోకేశ్ లో కూడా పదును పెరుగుతోంది. ఆయా అంశాలపై ఇప్పటికే తనదైన శైలిలో విషయ పరిజ్ఝానం పెంచుకున్న లోకేశ్… ఇప్పుడు ప్రత్యర్థి వర్గంపై తనదైన శైలి విమర్శనాస్త్రాలను సంధిస్తూ…. టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. ఇటీవలి కాలంలో తరచూ మీడియా ముందుకు వస్తున్న లోకేశ్… అధికార వైసీపీపై, ప్రత్యేకించి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, జగన్ రెడ్డి వర్గంపై ఓ రేంజిలో విమర్శలు సంధిస్తున్నారు.
ఈ విమర్శల పరంపరలో భాగంగా… ఇటీవలి పంచాయతీ ఎన్నికలు, తాజగా త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ శ్రేణులపై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. ఓటు వేయకపోతే పింఛన్ తీసేస్తా, ఓటేయకపోతే బియ్యం కార్డు తీసేస్తా అంటూ వైసీపీ శ్రేణులు ప్రజలను బెదిరిస్తున్నాయని ఆరోపించిన నారా లోకేశ్… వాటిని ఎందుకు తీసేస్తావంటూ నిప్పులు చెరిగారు. అవేమైనా నీ అబ్బ సొత్తా అంటూ ప్రశ్నించిన లోకేశ్… వైసీపీ భాషలోనే చెప్పాలంటే… అవేమైనా మీ అమ్మ మొగుడి సొత్తా అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగని లోకేశ్… పింఛన్ అయినా, రేషన్ అయినా జగన్ రెడ్డి సొత్తేమీ కాదని, అవన్నీ ప్రజల సొత్తేనన్న విషయాన్ని గ్రహించాలని వైసీపీ శ్రేణులకు తనదైన రేంజిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నిన్నటిదాకా లోకేశ్ లో పెద్దగా కనిపించని ఈ తరహా ప్రతిస్పందనతో టీడీపీ శ్రేణులు కూడా పెద్దగా ఆయన నుంచి ఏమీ ఆశించేవి కాదు. అయితే ఒక్కసారిగా తనదైన శైలి రాటుదేలిన తనాన్ని చూపడంతో పాటుగా జగన్ రెడ్డీ… అంటూ సూటిగా సుత్తి లేకుండా వైసీపీ అరాచకాలను ప్రస్తావిస్తూ లోకేశ్ చేసిన ప్రసంగం… వైసీపీ శ్రేణులకు ఆయన ఇచ్చిన వార్నింగ్ లాంటి మెసేజ్ తో టీడీపీ శ్రేణులకు నిజంగానే నూతనోత్తేజం వచ్చేసిందనే చెప్పాలి. నారా లోకేశ్ ఇదే స్టామినాను కంటిన్యూ చేయాలన్న వాదనలు కూడా పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.
This post was last modified on February 26, 2021 10:33 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…