Political News

తిరుప‌తిపై చింత మోహ‌న్ ఎఫెక్ట్‌.. వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనిపై అధికార వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. సిట్టింగు సీటు కావ‌డం, వ‌రుస‌గా దీనిని గెలుచుకుంటూ ఉండ‌డం(2014, 2019)తో ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లోనూ దీనిని కైవ‌సం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఇప్ప‌టికే పార్టీ నిర్ణ‌యించుకుంది.

ఇక‌, ఇదే సీటును సొంతం చేసుకునేందుకు బీజేపీ-జ‌న‌సేన‌ల కూట‌మి ప‌ట్టుబ‌డుతోంది. అయితే.. ఈ పార్టీల మ‌ద్య టికెట్ వివాదం కొత్త మ‌లుపులు తిరుగుతుండ‌డంతో ఇది తేల‌డం.. పార్టీల త‌ర‌పున ప్ర‌చారం జ‌ర‌గ‌డం అనేది ఒకింత లేట‌య్యే అవ‌కాశం ఉంది. ఇక‌, అప్ప‌టికి వైసీపీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్నారు.

ఇక‌, టీడీపీ త‌ర‌పున ఇప్ప‌టికే బ‌రిలో నిలిచిన ప‌న‌బాక ల‌క్ష్మి.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌జ‌లు మ‌ళ్లీ రిసీవ్ చేసుకుంటారా? లేదా? అనేది సందేహం. ఇదిలావుంటే.. లైవ్‌లో దూకుడుగా ఉన్న పార్టీల కంటే.. కూడా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా టాక్ లేని కాంగ్రెస్ నుంచి మాత్రం ఇప్పుడు వైసీపీకి ఇబ్బంది మొద‌లైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై వైసీపీ‌లోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ జోరుగా సాగుతోంది.

పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ చింతా మోహ‌న్‌.. వైసీపీని ఇటీవ‌ల కాలంలో భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్‌ను, వైఎస్ కుటుంబాన్ని.. ఆయ‌న వ్య‌వ‌హారాన్ని ఆయ‌న టార్గెట్ చేస్తున్న తీరు.. మేధావుల‌ను సైతం ఆలోచింప‌చేస్తోంది.

జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కాద‌ని.. ఆయ‌న వేస్ట్ అని చింతా మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తీవ్ర ‌ప్ర‌చారానికి వ‌చ్చాయి. ఆయ‌న ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాలు కూడా కాంగ్రెస్‌ని కాపీ కొట్టిన‌వేన‌ని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నార‌ని.. ఇలా చింతా మోహ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. మొద‌ట్లో వీటిని లైట్ తీసుకున్న వైసీపీ.. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో చింతా మోహ‌న్‌కు ఉన్న బ‌లం నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భావం చూపుతున్నాయ‌నే భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. కొత్త స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నాయ‌కులు అనుకుంటున్నారు.
పైగా ఇప్ప‌టికే మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ ప్ర‌జ‌ల‌ను కూడ‌గ‌డుతోంది. మ‌రోవైపు తిరుప‌తి అభివృద్ది త‌మ‌దేన‌ని చెబుతోంది. ఇలా అటు వ్య‌క్తిగ‌తంగా ఇటు పాల‌న ప‌రంగా కూడా వైసీపీ తిరుప‌తిలో టార్గెట్ అవుతుండ‌డంతో రేపు ఏం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 19, 2021 7:21 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

1 hour ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago