మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. డెస్సింగ్ విషయంలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు అస్సలు క్రమం తప్పరు. యూనిఫారం మాదిరి ఒకేలాంటి దుస్తుల్ని ఆయన ధరిస్తుంటారు. పార్టీ రంగు అయిన పసుపుకు చాలా లైట్ గా ఉంటే పసుపు.. గోధుమ రంగులో ఉంటే ఫ్యాంట్.. షర్టు వేసుకోవటం ఆయనకు అలవాటు. నిజానికి చంద్రబాబు అన్నంతనే కళ్ల ముందు ఆయన రూపం అలానే కనిపిస్తుంది.
అలాంటి చంద్రబాబు తాజాగా విశాఖ పర్యటనకు రావటం తెలిసిందే. ఆంధ్రోళ్ల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు అమ్మేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. దానిపై పోరాడేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన.. సరికొత్త లుక్ తో ప్రత్యేకంగా కనిపించారు.
రోటీన్ కు భిన్నంగా ఆయన ఫ్యాంట్.. ,చొక్కా రంగులు మారిపోయాయి. కొట్టొచ్చినట్లుగా కనిపించే మార్పు బాబులో కనిపించటం గమనార్హం. దీనికి తోడు.. ముఖానికి పెద్ద బొట్టు పెట్టుకున్న ఆయన రోటీన్ కు భిన్నంగా ఉన్నారని చెప్పక తప్పదు. ఎప్పుడూ ఒకేలాంటి డ్రెస్సులో కనిపించే బాబు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా దర్శనమివ్వటం గమనార్హం. ఇదే అంశం తెలుగు తమ్ముళ్ల మధ్య కూడా చర్చకు వచ్చింది.
This post was last modified on February 17, 2021 12:35 pm
నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…