విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయం తెరమీదికి రాగానే.. ఆ ప్రాంత ప్రజలు సహా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు.. పల్లా శ్రీనివాస రావు.. ఆమరణ దీక్షకు దిగారు. ఈ దీక్ష పీక్ స్టేజ్‌కు చేరింది. పల్లాకు మద్దతుగా టీడీపీ భారీగా శ్రేణులను తరలించడం తోపాటు.. కీలక నేతలు సైతం విశాఖకు చేరుకుని.. పల్లాకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు.. చంద్రబాబు కూడా విశాఖకు వెళ్తున్నారు. దీంతో ఉక్కు ఉద్యమం.. అందునా.. టీడీపీ నేతృత్వం లో చేపడుతున్న ఉక్కు ఉద్యమం.. పీక్ స్టేజ్‌కు చేరుతోందని భావించిన జగన్ సర్కారు ఉక్కు పాదం మోపడం గమనార్హం.
విశాఖ ఉక్కుకోసం ఆమరణ దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాసరావును మంగళవారం తెల్లవారు జామున.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి.. విశాఖ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వెనువెంటనే గ్లూకోజ్ బాటిళ్లను ఎక్కించడం ప్రారంభించారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురుగా టీడీపీ ఆధ్వర్యంలో వేసిన.. శిబిరాలను కూడా అధికారలు తొలగించే ప్రయత్నం చేశారు.
ఇదిలావుంటే.. గుంటూరులోని రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతాంగం.. తాజాగా తమ ఉద్యమాన్ని విశాఖ ఉక్కు వరకు తీసుకువచ్చింది. దాదాపు వంద మంది అమరావతి రైతులు.. విశాఖ ఉక్కు కోసం ఉద్యమి స్తున్న ప్రాంతానికి చేరుకుని.. తమ సంఘీభావం తెలిపారు.
అయితే.. ఇతర ప్రాంతాల వారిని అనుమతించబోమని.. పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరిని అరెస్టు చేయాలా? వద్దా? అనే అంశంపై మాత్రం తర్జన భర్జన పడుతున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. వైసీపిని ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. విశాఖ ఉక్కు కోసం.. తాము కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం పెద్దలు ఇప్పుడు ఇలా ఉద్యమం చేస్తున్నవారిని అరెస్టులు చేయడం.. శిబిరాలను ఎత్తేసేలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. మరి వైసీపీ నేతలు ఏం చెబుతారో చూడాలి.
This post was last modified on February 16, 2021 10:52 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…