నరేంద్రమోడి మామూలుగా అయితే క్లీన్ షేవ్ లోనే కనిపిస్తారు. కానీ కొద్ది కాలంగా మాత్రం బాగా గడ్డం పెంచేసి కనిపిస్తున్నారు. పెరిగిన గడ్డాన్ని కూడా ట్రిమ్ చేసుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. దాంతో ఇపుడో మోడి గడ్డంపై సోషల్ మీడియాలో కామెంట్లు, సెటైర్లు కూడా పడుతున్నాయి. ఇంతకీ మోడి గడ్డాన్ని పెంచటం వెనుక ఏమైనా రహస్యముందా ? ఉందా అంటే ఉందనే అంటున్నారు నెటిజన్లు.
ఇంతకీ నెటిజన్ల ప్రకారం ఆ రహస్యం ఏమిటయ్యా అంటే తొందరలోనే జరగబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికలేనట. పశ్చిమబెంగాల్ ఎన్నికలకు మోడి గడ్డానికి సంబంధం ఏమిటి ? ఏమిటంటే రబీంద్రనాద్ ఠాగూరే. మన జాతీయ గీతాన్ని రచించింది రబీంద్రనాద్ ఠాగూరన్న విషయం అందరికీ తెలిసిందే. ఠాగోర్ ఫొటోలు ఎక్కడ చూసినా ఎప్పుడూ పెద్ద గడ్డంతోనే కనిపిస్తారు.
రబీంద్రనాద్ ఠాగూర్ అంటే బెంగాలీయులకు ఆరాధ్యదైవమనే చెప్పాలి. అలాంటి ఠాగూర్ ను పోలినట్లుగా ఉండటం కోసం మోడి కూడా బాగా గడ్డాన్ని పెంచేస్తున్నట్ల నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తొందరలోనే బెంగాల్ కు జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఎంత వీలైతే అంత చిచ్చు పెడుతున్నారు. వాళ్ళ ఎంపి+ఎంఎల్ఏలను కమలంపార్టీలోకి లాగేసుకుంటున్నారు.
ఇవన్నీ ఒకఎత్తైతే ఎన్నికల్లో మోడినే స్టార్ కాంపైనర్ అన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జరిగే రోడ్డుషోలు, బహిరంగసభల్లో మోడి బెంగాల్లో పర్యటిస్తారు. అప్పుడు తనను చూసిన జనాలకు రబీంద్రనాద్ ఠాగూరే కనబడలాని మోడి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేస్తున్నట్లు సెటైర్లు పడుతున్నాయి. మరి మోడి గడ్డం బీజేపీని బెంగాల్లో గట్టెక్కిస్తుందా ?
This post was last modified on February 14, 2021 1:19 pm
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…