తెలంగాణాలో రాజకీయ అరంగేట్రం చేయించటం ద్వారా షర్మిల రూపంలో కేసీయార్ కు జగన్మోహన్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా ? అలాగనే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు తెలంగాణా-ఏపి మధ్య రిటర్న్ గిఫ్ట్ అంశపై పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్+టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని ముందస్తు ఎన్నికల తర్వాత కేసీయార్ ప్రస్తావిస్తూ చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చేసిన ప్రకటన అప్పట్లో సంచలనమైంది.
తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ సంగతి కొంతకాలం చర్చ జరిగినా తర్వాత మరుగునపడిపోయింది. అలాంటిది ఇప్పుడు షర్మిల కారణంగా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే తాజా రిటర్న్ గిఫ్ట్ విషయంలో మాత్రం రెండు రకాలుగా చర్చలు జరుగుతోంది. మొదటిదేమో బీజేపీ+కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు కేసీయార్+జగన్ కలిసే షర్మిలను రంగంలోకి దింపారనేది ఒక చర్చ.
ఇదే సమయంలో షర్మిల పార్టీ పెట్టే విషయంలో జగన్ కు సంబంధం లేదని ఆమె సొంతంగానే నిర్ణయం తీసుకున్నదనేది మరో చర్చ. మొదటి చర్చ ప్రకారమైతే కేసీయార్ కు జగన్ సాయం అందించేందుకు షర్మిల పార్టీ రూపంలో జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. ఇక రెండో పద్దతిలో అయితే చివరకు కేసీయార్ ను కూడా దెబ్బ కొట్టే వ్యూహంతోనే జగన్ తన చెల్లెలిని రంగంలోకి దింపి మంచి రిటర్న్ గిఫ్టే ఇచ్చారని ఎద్దేవా గా చర్చించుకుంటున్నారు.
అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రూపం ఏదైనా కానీండి కేసీయార్ కు జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవటమే ముఖ్యం. ఒక్కోసారి మనం ఏదో అంచనాలు వేసుకుని ఓ పని మొదలుపెడతాం. కానీ మనం అనుకున్న పని గ్రౌండ్ అయిన తర్వాత పరిస్ధితులను బట్టి మనం అనుకున్నదానికి భిన్నంగా ఎటెటో వెళిపోతుంది. చివరకు తెలంగాణా రాజకీయాల్లోకి షర్మిల కొత్తపార్టీతో అడుగుపెట్టడం కూడా అలాగే అయిపోతందా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పొలిటికల్ వ్యాక్యూమ్ ను గనుక షర్మిల భర్తీ చేయగలిగితే చివరకు ఆమె కేసీయార్ కు ఏకుమేకై కూర్చున్న ఆశ్చర్యపోవక్కర్లేదు. చూద్దాం ఏమి జరగబోతోందో.
This post was last modified on February 14, 2021 10:30 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…