ఔను! ఇక కండువా మార్చుడే!
– అనే కామెంట్.. మాజీ మంత్రి, టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు గురించి గుసుగుస జోరుగా వినిపిస్తోంది. టీడీపీలో గెలిచినా.. ఆయన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో.. మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు.. పార్టీ అదినేత చంద్రబాబుకు కూడా కడు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట.. ఆయన పార్టీ మారి.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే కథనాలు కూడా వచ్చాయి. అయితే.. నేను కాదు.. కుదిరితే.. నా కుమారుడిని జాయిన్ చేస్తా.. అనే స్టేట్ మెంట్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.
ఇక, ఈ వార్తలు ఇలా సాగుతున్న క్రమంలో.. వైసీపీ మంత్రి, ఇదే విశాఖ జిల్లాకు చెందిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు.. గంటా వైసీపీలో ఎలా వస్తారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటి నుంచి ఏమైందో గంటా అటు టీడీపీకి, ఇటు వైసీపీకి కూడా దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు విశాఖ ఉక్కు విషయం తెరమీదకి రాగానే.. తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు గంటా. అయితే.. ఈ విషయాన్ని ఆయన కనీసం పార్టీ టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు గానీ, ఆ పార్టీ కీలక నేతలకు కానీ.. చెప్పకపోవడం గమనార్హం. అదేసమయంలో ఆయన విశాఖ ఉక్కు కోసమే తను రాజీనామా చేశానని చెప్పి.. మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసినా.. ఈ క్రమంలో టీడీపీ కూడా విశాఖ ఉక్కుకోసం ఉద్యమాలు ప్రారంభించింది. దీనికి మాత్రం గంటా మద్దతివ్వకపోవడం గమనార్హం.
ముఖ్యంగా టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాసరావు.. ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీనికి టీడీపీలోని నాయకులు మద్దతు తెలిపారు. స్థానికంగా ఉన్న అయ్యన్న పాత్రుడు వంటివారు వెళ్లి సంఘీభావంగా దీక్షలోనూ కూర్చున్నారు. అయితే.. ఏ ఉక్కు కోసం రాజీనామా చేశారో.. అదే ఉక్కు కోసం సొంత పార్టీ నాయకుడు దీక్ష కు దిగితే.. గంటా శ్రీనివాసరావు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
అంతేనా.. వైసీపీ నాయకులు ప్రత్యక్షంగా మద్దతిస్తున్న కార్మికుల నిరసనకు, అందునా.. మంత్రి అవంతి శ్రీనివాసరావు కనుసన్నల్లో జరుగుతున్న కార్యక్రమానికి గంటా హాజరు కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఇద్దరు నాయకులు కూడా ఒకే వేదిక పంచుకున్నారు. ఈ పరిణామాలను గమనించిన వారు.. ఇక, రేపో మాపో.. గంటా వైసీపీలోకి చేరిపోవడం ఖాయమని.. కండువా మార్చుకోవడానికేనని.. అంటుండడం గమనార్హం. జరుగుతున్న పరిణామాలు.. గంటా వేస్తున్న అడుగులు కూడా ఆదిశగానే ఉండడం విశేషం.
This post was last modified on February 13, 2021 11:47 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…