నిన్న (గురువారం) కొలువు తీరిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలిని చూసినప్పుడు ఆసక్తికరమైన అంశం ఒకటి దర్శనమిచ్చింది. మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్న జీహెచ్ఎంసీలో మగాళ్లను మహిళలు ఓడించారు. రిజర్వేషన్ ప్రకారం చూసినప్పుడు 50 శాతం మహిళలు అన్నది అమలు చేసినప్పుడు 75 మంది మహిళా కార్పొరేటర్లు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే.. ఈసారి 80 మంది మహిళలు ఎన్నికయ్యారు.
దీంతో 150 మంది కార్పొరేటర్లలో సగం కంటే ఎక్కువగా మహిళలు దర్శనమిచ్చారు. ఇలాంటి సందర్భం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రిజర్వేషన్ విధానంలో ఈసారి మేయర్ గా మహిళను ఎంపిక చేసుకోవాల్సి రావటం.. అనూహ్యంగా డిప్యూటీ మేయర్ ను కూడా మహిళనే ఎంపిక చేయటంతో.. నగరానికి ప్రధమ.. ద్వితీయ రెండు స్థానాలు మహిళలే నిలిచారు.
అంతేకాక.. సగాని కంటే ఎక్కువ కార్పొరేటర్లు మహిళలే కావటంతో.. గ్రేటర్ పాలక మండలి వరకు మగాళ్లను తోసి రాజన్నట్లుగా మహిళలు మారారు. పురుషాధిక్య సమాజంలో.. అందునా రాజకీయాల్లో మహిళలకు అవకాశం అంతంత మాత్రంగా లభించే రోజుల్లో.. అందుకు భిన్నంగా గ్రేటర్ పాలక మండలి మొత్తం మహిళలదే రాజ్యమన్నట్లుగా మారటం విశేషం. మొత్తానికి గ్రేటర్ మగాళ్లను ఓడించిన గ్రేటర్ మహిళలు మారారు. ఇది అరుదైనదిగా చెప్పక తప్పదు.
This post was last modified on February 12, 2021 12:45 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…