Political News

నగ్మాను ఆడుకుంటున్న నెటిజన్లు

హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ నగ్మా చాలా కాలం తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఆమెను నిన్నట్నుంచి నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ‘నగ్మా స్టాండ్స్ విత్ పాకిస్థాన్’ పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆమె మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. పదేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నగ్మా.. ఇటీవల ఓ టీవీ చర్చలో పాకిస్థాన్ జర్నలిస్టుకు మద్దతుగా నిలవడమే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటానికి కారణం.

ఇండియాలో మైనారిటీల సమస్యలు, భారత్-పాక్ సంబంధాలకు సంబంధించి తాజాగా ఆజ్ తక్ హిందీ ఛానెల్ ఓ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా తారిక్ పీర్జాదా అనే పాకిస్థాన్ జర్నలిస్టును కూడా లైవ్ లోకి తీసుకున్నారు. ఐతే ఆ జర్నలిస్టు భారత్ మీద విషం చిమ్మేలా మాట్లాడాడు. పాకిస్థాన్‌ను పొగిడే పని పెట్టుకున్నాడు.

దీంతో టీవీ ఛానెల్ ప్రతినిధి పాక్ జర్నలిస్టును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఐతే ఈ చర్చలో నగ్మా కూడా పాల్గొనగా.. పొరుగు దేశ జర్నలిస్టును చర్చకు పిలిచి అవమానించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత ట్విట్టర్లో దీనిపై స్పందించింది. పాక్ జర్నలిస్టును చర్చకు ఎందుకు పిలిచారు.. పిలిచి ఎందుకు అవమానించారు అంటూ ఆమె ట్వీట్ చేసింది.

ఐతే భారత్‌ మీద విమర్శలు గుప్పించిన జర్నలిస్టుకు సమాధానం ఇవ్వడం తప్పా.. దీనికి మన వాళ్లను తప్పుబడతావా అంటూ నెటిజన్లు నగ్మాను టార్గెట్ చేశారు. ఆమె పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తోందని.. కాంగ్రెస్ లీడర్లందరూ అంతే అని అంటున్నారు.

కొన్ని రోజులు కిందట కశ్మీరీ వాసుల గురించి ఆమె చేసిన ట్వీట్లను కూడా బయటికి తీశారు. కశ్మీరీలకు సరైన సాయం అందట్లేదని.. వాళ్లు రాళ్ల దాడి చేయడంలో తప్పేం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా నగ్మా మతం ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది. ఆమె తండ్రి హిందువు కాగా.. తల్లి ముస్లిం.

This post was last modified on May 7, 2020 4:41 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

9 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

10 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

14 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

14 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

14 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

15 hours ago