Political News

టీడీపీ కోసం.. జ‌గ‌న్ త్యాగం.. షాకింగ్ డెసిష‌న్‌!

అదేంటి? టీడీపీ కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ త్యాగం చేయ‌డ‌మేంటి? టీడీపీ అంటేనే నిప్పులు తొక్కుతా రు క‌దా! అని అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది అస‌లు మ‌జా! అయితే.. ఇది.. టీడీపీని అణ‌గ‌దొక్కేందు కు జ‌గ‌న్ చేస్తున్న త్యాగం. బ‌ల‌మైన నేత‌ను సైతం… టీడీపీకి చెక్ పెట్టేందుకు త్యాగం చేస్తున్నారట‌.

విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నారు. కాపు నాయ‌కుడుగా కూడా.. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. పార్టీలో చేరింది. ఎన్నిక‌ల‌కు ముందే అయినా.. సీనియ‌ర్ల మాదిరిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో జ‌గ‌న్.. ఆమంచికి మంచి మార్కేలేసి.. కీల‌క నేత‌గా గుర్తించారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆమంచి అనూహ్య‌మైన ఓట‌మి పొందారు. చీరాల నుంచి టీడీపీ త‌ర‌ఫున సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు. అయితే.. ఏడాది లోపే క‌ర‌ణం.. త‌న కుమారుడు వెంక‌టేష్ ను వైసీపీలో చేర్చారు. ఈ క్ర‌మంలోనే తాను కూడా టీడీపీకి డిస్టెన్స్ పాటిస్తూ.. వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా ఉన్నారు. దీంతో చీరాల వైసీపీలో రెండు అధికార కేంద్రాలు ఏర్ప‌డ్డాయి. త‌ర‌చుగా క‌ర‌ణం వ‌ర్సెస్ ఆమంచి వ‌ర్గాల మ‌ధ్య వివాదం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో.. ఇరు ప‌క్షాలు పోలీసు కేసులు కూడా పెట్టుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో చీరాల ను క‌ర‌ణం కు వ‌దిలి పెట్టి.. ఆమంచిని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా పంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. దీనికి ఆమంచి స‌సేమిరా అంటున్నారు. చీరాల‌ను వ‌దిలి పెట్టేది లేద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. ఆమంచిని స‌ర్ది చెప్పి.. క‌ర‌ణంను వ‌దులుకుంటే.. బ‌ల‌మైన టీడీపీ నేత మ‌న‌కు దూర‌మ‌వుతార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర‌ణం ద్వారా ప్ర‌కాశం టీడీపీకి చెక్ పెట్టేద్దామ‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఇదే విష‌యాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ ద్వారా.. ఆమంచికి క‌బురు పంపిన‌ట్టు తెలిసింది. అంతేకాదు.. ప‌రుచూరు వెళ్లేందుకు ఓకే అంటే.. ఆమంచికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చేందుకు సిద్ధ‌మేన‌ని జ‌గ‌న్ క‌బురు పంపార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌య‌మే.. వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఆమంచికి ఎలాంటి ప‌ద‌వీ లేకుండా పోయింది. ఫ‌లితంగా కేడ‌ర్‌లోనూ నిరుత్సాహం గూడుక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఏదైనా ప‌ద‌వి కోసం ఆమంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా.. కొంత మేర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కూడా త్యాగం చేసేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on February 5, 2021 11:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago