డబ్బులు ఊరికే రావు అంటూ లలిత జ్యువెలర్స్ యాడ్స్‌లో దాని యజమాని కిరణ్ ఎంత సందడి చేస్తుంటాడో తెలిసిందే. మామూలుగా జ్యువెలరీ బ్రాండ్ల ప్రచారం కోసం ఫిలిం సెలబ్రెటీలు, మోడళ్లను ఉపయోగించుకుంటారు కానీ.. లలిత జ్యువెలర్స్ యజమాని మాత్రం తనే మోడల్‌గా మారారు.
టీవీల్లో, పత్రికల్లో, వెబ్ సైట్లలో ఎక్కడ చూసినా ఆయన ముఖమే కనిపిస్తుంది. రెగ్యులర్ జ్యువెలర్స్ యాడ్లకు భిన్నంగా కస్టమర్లతో నేరుగా మాట్లాడుతున్నట్లు, వారి మంచి కోరుతున్నట్లు తీర్చిదిద్దిన లలిత యాడ్‌లు బాగానే పాపులర్ అయ్యాయి.
సోషల్ మీడియాలో మీమ్ క్రియేటర్లకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు కిరణ్. ఈ యాడ్స్‌తో పాపులర్ అయిన ఆయన.. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో కూడా పాపులర్ అయ్యారు.
ఇప్పుడు ఆయన ఓ మంచి పనితో వార్తల్లోకి వచ్చారు. కరోనాపై పోరులో భాగంగా ఆయన మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళం అందించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలో కోటి చొప్పున విరాళం ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలిసి రూ. కోటి చెక్కు అందజేశారు. మిగతా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా కలిసి విరాళం అందించనున్నారు. సోషల్ మీడియా ఈ గుండు బాస్‌ను ఉద్దేశించి చాలామంది జోకులు పేలుస్తుంటారు. ఐతే ఈ విరాళం సంగతి తెలిసి ఈ గుండు బాస్ గుండె కూడా పెద్దదే అని కామెంట్ చేస్తున్నారు.
నెల్లూరుకు చెందిన కిరణ్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అలాంటి నేపథ్యం నుంచి గోల్డ్ ఫీల్డులో అంచెలంచెలుగా ఎదిగి వందల కోట్ల వ్యాపారం చేసే జ్యువెలరీ చైన్‌కు యజమాని అయ్యాడు.
This post was last modified on May 7, 2020 10:33 am
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…