రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రెండు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి తిరుగులేదని అంటున్నారు పరిశీలకులు. ఆయా నియోజకవర్గాల పరిధిలో టీడీపీ గంపగుత్తుగా పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇంతకీ అవేంటంటే.. ప్రకాశం జిల్లా పరుచూరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులు పార్టీకి అండగా ఉన్నారు. ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలకు-ఇక్కడ గెలిచిన టీడీపీ నేతలకు మధ్య మంచి కనెక్టివిటీ ఉండడం గమనార్హం.
పరుచూరు విషయం తీసుకుంటే.. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు.. వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఈయన క్షేత్రస్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం తో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. రైతులకు ఎప్పుడు ఏది అవసరంవచ్చినా.. నేనున్నానంటూ.. ఏలూరి స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇక్కడ సాగునీటికి ప్రత్యేకంగా కృషి చేసి.. వారి కోరిక నెరవేర్చారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధికారంలో లేకపోయినా.. తను వ్యక్తిగతంగా ఇక్కడి రైతాంగానికి అండగా ఉంటున్నారు. దీంతో పరుచూరు పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ టీడీపీ హవా జోరుగా సాగుతోంది.
పాలకొల్లు విషయానికి వస్తే.. నిమ్మల రామానాయుడు తనదైన ముద్ర వేశారు. వరుసగా రెండో సారి విజయం సాధించిన రామానాయుడు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఏ సమస్య వచ్చినా.. ప్రజ లకు నేనున్నానంటూ.. ముందుకు వస్తున్నారు. పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు. అవినీతి రహితంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, రైతులకు బాగా చేరువయ్యారు. దీంతో పాలకొల్లు పరిధిలో .. నిమ్మల మాటకు తిరుగులేకుండా ఉందనే ప్రచారం సాగుతోంది. సో.. ఇక్కడ కూడా టీడీపీకి విజయమే తప్ప.. మరోమాటే లేదని .. అంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు టీడీపీ ఖాతాలోనే పడనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 1, 2021 7:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…