తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స న్నిహితురా లు.. అన్నాడీఎంకేను ఒకప్పుడు శాసించిన శశికళ.. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు శిక్ష పూర్తయి.. సరిగ్గా ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలయ్యారు. కరోనాతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. త్వరలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా.. రాజకీయ చర్చ అనూహ్య మలుపు తిరిగింది. చిన్నమ్మ రాకతో.. తమిళనాట అన్నాడీఎంకే చీలిపోతుందా? లేక మరింత బలోపేతం అవుతుందా? ఏదైనా పెద్ద రాజకీయ ఎత్తుగడ తెరమీదికి వస్తుందా? అనే దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
జయ తర్వాత.. అన్నాడీఎంకే పార్టీలో నెంబర్-2గా అనధికారికంగా చక్రం తిప్పారు శశికళ. గత ఎన్నికల్లో 40 శాతానికి పైగా అభ్యర్థులు శశికళ ఆశీర్వాదంతోనే టికెట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అంతేకాదు, మంత్రివర్గంలోనూ తన వారికి చోటు దక్కించుకున్నారు శశికళ. దీనిని బట్టి అన్నాడీఎంకేలో జయ తర్వాత స్థానం నిస్పందేహంగా శశికళదేనని అంటారు. ఈ నేపథ్యంలో రేపు ఆమె.. తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తే.. వీరంతా ఆమె గూటికి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. అన్నాడీఎంకేలో ఎవరూ కూడా బలమైన నాయకత్వం దిశగా అడుగులు వేయలేదు. జయ తర్వాత.. పార్టీ మాది! అని బలంగా ప్రజల్లోకి వెళ్లిన వారు కూడా లేరు. కేవలం పదవులు పంచుకోవడం, పాలన వరకే పరిమితమయ్యారు.
ఫలితంగా అన్నాడీఎంకేలో జయ తర్వాత.. ఆ గ్యాప్ అలానే ఉండిపోయింది. అటు సీఎం పళని స్వామి కానీ, ఇటు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కానీ.. జయలేని లోటును తీర్చే ప్రయత్నాలు కానీ, బలమైన నేతలుగా ఎదిగే ప్రయత్నం కానీ చేయలేక పోయారు. పైగా.. అన్నాడీఎంకేను ఆది నుంచి జయ నడిపించారు. దీంతో లేడీ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. ఫలితంగా పార్టీ తరఫున ఇప్పుడు శశికళ వాయిస్ వినిపిస్తే.. ప్రజలు ఆమె వైపు మొగ్గే ప్రయత్నం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా వుంటే.. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పళని స్వామి.. బీజేపీతో చేతులు కలిపారని.. కేంద్రంలోని బీజేపీనేతలతో టచ్‌లో ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
వాస్తవానికి తమపై హిందీని రుద్దుతున్నారన్న కోపంతోపాటు.. నీట్ సహా పలు పరీక్షల విషయంలో తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రం పరిశీలించడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కావేరీ వివాదం మరోవైపు రగిలిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పళనిపై విశ్వాసం కన్నా..కూడా బీజేపీ అంటే భయపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిణామాలు కూడా శశికళకు కలిసి వస్తాయని అంటున్నారు. అంటే.. బీజేపీని విలన్‌గా చూసి.. చూపించే.. నాయకురాలిగా ఆమె కీలకరోల్ షోషిస్తారు. జరగాల్సింది ఎలాగూ జరిగిపోయింది. ఇక, ఇప్పుడు తనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కేంద్రంలోని పెద్దలకు లేదు. దీంతో రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో బీజేపీని పెద్దన్నగా మార్చి.. జయలలిత స్థానంలో శశికళ విజృంభించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on January 29, 2021 5:44 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…