Political News

మూడు ఘ‌ట‌న‌లు-మోడీపై ముప్పేట దాడి..!

స్వ‌తంత్ర భార‌త దేశంలో గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని.. ఎప్పుడు క‌నీ వినీ ఎరుగ‌ని సంఘ‌ట‌న‌లు చోటు చేసు కుంటున్నాయి. ఫ‌లితంగా ఈ ఎఫెక్ట్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఎక్కువ‌గానే ఉంది. మ‌రీ ముఖ్యంగా అంత ‌ర్జాతీయంగా.. నేను ఎంతో కీర్తి గ‌డించాను. తిరుగులేని పాల‌న‌తో.. దూర‌దృష్టితో అంత‌ర్జాతీయ పొలిటిక‌ల్ అవ‌నికపై నా ప్ర‌భ జ‌గ‌జ్జ‌గేయ‌మానంగా మెరిసిపోతోంది!! అని చెప్పుకొనే మోడీకి ఇప్పుడు మూడు ప్ర‌ధాన విష‌యాలు ప్రాణ‌సంక‌టంగా మారాయి. ఈ మూడు విష‌యాలు కూడా రైతు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కే సంబంధించిని కావ‌డం గ‌మ‌నార్హం.

  1. రైతుల ఆందోళ‌న‌:
    నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై పంజాబ్ స‌హా ఇత‌ర రాష్ట్రాల రైతులు ఉద్య‌మించారు. ఢిల్లీ స‌రిహ‌ద్దులో మోహ‌రించి నెల‌ల త‌ర‌బ‌డి ఉద్య‌మం చేశారు. ఎముక‌లు కొరికే చ‌లిలోనూ వారు ఆందోళ‌న కొన‌సాగించారు. ఫ‌లితంగా మోడీ స‌ర్కారుకు ఇంటా బ‌య‌టా.. తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అంత‌ర్జాతీ య స‌మాజం నుంచి కూడా మోడీనికి ఎదురీత ఎదురైంది. బ్రిట‌న్ స‌హా ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా రైతుల‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. రైతుల‌పై బ‌ల ప్ర‌యోగం వ‌ద్దంటూ. . సూచ‌న‌లు రావ‌డం గ‌మ‌నార్హం.
  2. ఎర్ర‌కోట ధ్వంసం:
    రైతు ఉద్య‌మాన్ని నిలువ‌రించ‌డంలోను, వారిని శాంత ప‌ర‌చ‌డంలోనూ కేంద్ర ప్ర భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న దేశంలోనేకాదు. అంత‌ర్జాతీయంగా కూడా వినిపిస్తోంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు.. రైతులు నిర్వ‌హించిన ట్రాక్ట‌ర్ ర్యాలీ తీవ్ర వివాదానికి దేశ అత్యున్న‌త వేదిక అయిన ఎర్ర‌కోట విధ్వంసానికి దారితీసింది. దీనిపై అంత‌ర్జాతీయ స‌మాజం నివ్వెర పోయింది. ఇది ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రిగింద‌న్న వాద‌న బ‌లంగా వినిపించ‌డం గ‌మ‌నార్హం. దీనిని నిలువ‌రించ‌లేక పోయార‌నే వ్యాఖ్య‌లు మోడీ చ‌ట్టూ ముసురుకోవ‌డం విశేషం.
  3. విప‌క్షాల బ‌హిష్క‌ర‌ణ‌:
    ఇది అన్నింటిక‌న్నా.. కీల‌క ప‌రిణామం. ఏకంగా 18 ప్ర‌తిప‌క్ష పార్టీలు.. ప్ర‌స్తుతం ప్రారంభ‌మైన లోక్ స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించడం. స్వ‌తంత్ర భార‌తంలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించిన ప్ర‌తిప‌క్షాలు ఉన్నాయి. అయితే.. ఆయా పార్టీల‌కు న‌చ్చ‌జెప్పి లైన్‌లోకి తెచ్చుకున్న అధికార ప‌క్షాలు ఉన్నాయి. కానీ, మోడీ స‌ర్కారు మాత్రం విప‌క్షాల‌ను తృణీక‌రిస్తోంద‌నే వాద ‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని వినేందుకు విప‌క్షాలు సిద్ధ‌మ‌య్యేవి. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఇది కూడా తాజాగా అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశం కావ‌డం గ‌మ‌నార్హం. అయినా.. మోడీ మాత్రం ఉలుకుప‌లుకు లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 29, 2021 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

3 minutes ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

4 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

4 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

5 hours ago

నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ – భవిష్యత్ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…

6 hours ago