Political News

కీల‌క నిర్ణ‌యం.. కార్య‌క‌ర్త‌లు ఖుషీ ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా చెబుతున్న `కార్య‌క‌ర్తే నాయ‌కుడు` అనే మాట‌ను తాజాగా రుజువు చేశారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా పార్టీలో ఉంటూ ప‌నిచేస్తున్న‌వారికి.. స్థానిక ఎన్నికల్లో అవ‌కాశం క‌ల్పించారు. ఈ ప‌రిణామంతో పార్టీలో కార్య‌క‌ర్త‌లు, ముఖ్యంగా జెండా మోసే వారిలో సంతోషం వ్య‌క్తం అయ్యేలా చేసింది. భారీ సంఖ్య‌లో కాక‌పోయినా.. ఉన్న వారిలోనే కొంద‌రిని ఎంపిక చేయ‌డం ప‌ట్ల రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంగా ముందుకు క‌దిలేందుకు అవ‌కాశం ఏర్ప‌డిన‌ట్టు అయింది.

మంగళగిరి – తాడేపల్లి నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సామాన్య కార్యకర్త పేరం ఏడుకొండలుకు పార్టీ అవ‌కాశం క‌ల్పించింది. సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా ప్ర‌స్థానం ప్రారంభించిన పేరం.. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా పార్టీలో ఉన్నారు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన‌ప్ప‌టికీ.. ఆత్మీయ‌త విష‌యంలో పార్టీపైనే ఆయ‌న ఎక్కువ‌గా దృష్టి పెట్టారు.  అతి సామాన్య కుటుంబానికి చెందిన పేరం.. బీఏ పొలిటికల్‌ సైన్స్‌ పూర్తిచేయ‌డం గ‌మ‌నార్హం. గత పదేళ్లుగా టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయ‌న‌కు అవ‌కాశం చిక్క‌డంతో సాధార‌ణ కార్య‌క‌ర్త‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

పొన్నూరు మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ అభ్య‌ర్థిగా విజ‌య‌ల‌క్ష్మిని ఖ‌రారు చేశారు. ఆమె కూడా పార్టీలో సాధార‌ణ నాయ కురాలిగా.. ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా.. విజ‌య‌ల‌క్ష్మి భ‌ర్త హ‌నుమంత రావు కుటుంబ టీడీపీలోనే ఉంటూ.. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా.. మేమున్నామంటూ ప‌నిచేశారు. చంద్ర‌బాబును జైల్లో పెట్టిన‌ప్పుడు.. కాండ్రు కుటుంబం గ్రామాల్లో ప‌ర్య‌టించి చైత‌న్యం తీసుకువ‌చ్చారు. నారా లోకేష్ అంటే ప్రాణం పెట్టేఈ కుటుంబం ఆయ‌న మంగ‌ళ‌గిరిలో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌త్యేక పూజ‌లు చేసి అప్ప‌ట్లో వార్త‌లు నిలిచారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి అవ‌కాశం క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం.

కొత్త‌కాదు.. కానీ..
సాధార‌ణ కార్య‌క‌ర్త‌లకు ఇలా పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించ‌డం టీడీపీలో ఇప్పుడు కొత్త‌కాదు. గ‌తంలో అన్న‌గారు కూడా అనేక మంది సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే.. అప్ప‌టికి ఇప్ప‌టికి మార్పు ఉంది. గ‌తంలో రాజ‌కీయాల్లో చేరేవారు త‌క్కువ‌గా ఉండేవారు. జ‌నాభా కూడా త‌క్కువ‌గానే ఉండేది. దీంతో కార్య‌క‌ర్త ల‌కు అవ‌కాశం మెండుగా ద‌క్కేది. కానీ, ఇప్పుడు పార్టీ స‌భ్య‌త్వాలు పెరిగాయి. కార్య‌క‌ర్త‌ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో పోటీ పెరిగిపోయి.. ఆర్థిక‌,సామాజిక వ‌ర్గాల బ‌లం కూడా ప్ర‌భావం చూపిస్తున్న ద‌రిమిలా సామాన్యుల‌కు అవ‌కాశం చిక్క‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో కొంద‌రికైనా చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పించ‌డం.. మంచి ప‌రిణామ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 17, 2026 6:41 pm

Share

Recent Posts

హెల్ప్ చేయండి మేడం… నిర్మలమ్మకు చంద్ర‌బాబు విన‌తి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. సుమారు గంట‌న్న‌ర…

1 minute ago

జగన్ సైతాన్ సైన్యానికి పచ్చ రోగం తగ్గలేదు: షర్మిల

తమ ప్రత్యర్థి అయితే చాలు...టార్గెట్ చేయడం, వ్యక్తిత్వహననానికి పాల్పడడం వైసీపీ నేతలకు అలవాటే. నిండు శాసన సభలో అప్పటి ప్రతిపక్ష…

48 minutes ago

నాగవంశీ మాటల వెనుక మర్మమేమిటో

జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే…

2 hours ago

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఆ రెస్టారెంట్ కు వెళ్ళిన రాహుల్ గాంధీ

రాజకీయ బాధ్యతల వల్ల పెళ్లి చేసుకోలేదని పలు సందర్భాల్లో సరదాగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడొక రహస్యాన్ని…

2 hours ago

కర్నూలులో ప్రధాని మోదీ తల్లికి ఆలయం

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి…

4 hours ago

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్… చెక్ ఎప్పుడు?

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. తాడివారి మెరక వద్ద ఓఎన్‌జీసీ…

5 hours ago