ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన చిరకాల ప్రియుడు రాజ్‌వేల్ రాజ్‌తో ఆమె ఏడడుగులు వేసింది. అయితే మొదట పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రియా కూడా తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉన్న రాజ్‌వేల్‌తో ప్రియకు పదేళ్లకు పైగా ప్రేమ ప్రయాణం ఉంది. వీరిద్దరూ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ పెళ్లి విషయంలో తొందరపడలేదు. గతంలోనే తన పెళ్లి గురించి ప్రియా పలు సందర్భాల్లో మాట్లాడింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ జంట ఒక్కటైంది.
చెన్నైలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఎలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన వీడియోలో రాజ్‌వేల్ ప్రియా మెడలో తాళి కడుతున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మందిని ఈ వేడుకకు ఆహ్వానించలేదని తెలుస్తోంది. త్వరలోనే సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రవితేజ సరసన ఇరుముడి సినిమాలో నటించి ప్రియా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో డిమోంటే కాలనీ 3, మరగద నాణయం 2, ఇండియన్ 3 వంటి ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండనుంది.
This post was last modified on November 11, 2026 11:45 pm
Page: 1 2
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో కుటుంబ…
రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…
రామాయణం సినిమా రిలీజ్ ముంగిట ఎటు చూసినా నెగెటివ్ వార్తలే కనిపించేవి. రూ.4 వేల కోట్ల బడ్జెట్ సహా ఆ…
ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణం అంటేనే రద్దీ, హడావుడి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లలో ఎక్కడం, దిగడం ప్రయాణికులకు…
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ…
హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…