ఆ కూటమి నేత‌ల‌కు క్లాసిస్తారా.. ప‌క్క‌న పెడ‌తారా?!

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి త‌ర‌ఫున అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నా.. ఎక్క‌డో ఒక త‌ర‌హా అసంతృప్తి అయితే.. టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లో క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం.. కూట‌మి మిత్ర‌ప‌క్షం బీజేపీకి కేటాయించిన అనంత‌పురం స‌హా.. ప‌లు ప‌రిష‌త్ స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా క్షేత్ర‌స్థాయి నాయ‌కులు చేశారా?  లేక‌.. ఏం జ‌రిగింది? అనే విష‌యంపై కూట‌మి అంత‌ర్మ‌థ‌నం చేస్తోంది.

వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా.. కూట‌మి పార్టీలు క‌లివిడిగా ముందుకు సాగాల‌ని మిత్ర‌ప‌క్షాల అభ్య‌ర్థుల‌ను ఓన్ చేసుకుని విజ‌యం ద‌క్కేలా వ్య‌వ‌హ‌రించాల‌ని టీడీపీ,జ‌న‌సేన‌, బీజేపీలు సంయుక్తంగా ప్ర‌క‌ట‌న ఇచ్చాయి. వీటిలో టీడీపీదే ఎక్కువ భాగ‌స్వామ్యం. ఎందుకంటే క్షేత్ర‌స్థాయిలో దేశం పార్టీకే బ‌ల‌మైన నాయ‌కులు కేడ‌ర్ కూడా ఉంది. దీంతో ఆ పార్టీ చొర‌వ అత్యంత‌ కీల‌కం. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌, బీజేపీల‌కు స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు ప‌దేపదే కేడ‌ర్‌కు చెప్పారు.

అయిన‌ప్పటికీ.. బీజేపీ స‌హా.. జ‌న‌సేన కూడా ప‌లు ప్రాంతాల్లో ఓడిపోయాయి. మ‌రీ ముఖ్యంగా అనంత‌పురం అంటే.. టీడీపీకి కంచుకోట‌. పైగా.. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నేత‌లే. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ కార్పొరేష‌న్‌ను వైసీపీ గెలుచుకున్న ద‌రిమిలా అస‌లు ఏం జ‌రిగింద‌న్న విష‌యంపై చంద్ర‌బాబు ఆరా తీశారు. తాజాగా దీనికి సంబంధించిన క్షేత్ర‌స్థాయి నివేదిక కూడా చంద్ర‌బాబుకు చేరిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే స‌మ‌న్వయం లేక‌పోవ‌డం.. బీజేపీ, జ‌న‌సేన నాయ‌కుల‌తో స‌త్సంబంధాల‌ను కొన‌సాగించ‌క పోవ‌డం వ‌ల్లే ఇక్క‌డ ఓడిపోయిన‌ట్టు చెబుతున్నారు.

అలానే.. పోల‌వ‌రంలో జ‌న‌సేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్య‌వ‌హారంపై ఆ పార్టీ కూడా ఆందోళ‌న‌గానే ఉంది. ఇక్క‌డ వైసీపీ మెజారిటీ స్థానాలు ద‌క్కించుకుంది. చిత్రం ఏంటంటే.. పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ప‌రిహారం ఇచ్చిన మండ‌లాల్లోనే వైసీపీ గెల‌వ‌డం.. మ‌రింత‌గా పార్టీల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో స్థానిక జ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హార శైలి కార‌ణంగానే పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అలానే.. అల్లూరి జిల్లాలోనూ వైసీపీ ఘ‌న‌మైన స్థానాలు ద‌క్కించుకుంది. ఏకంగా జ‌డ్పీపీఠం కూడా సొంతం చేసుకుంది. దీనికి కార‌ణాలు కూడా.. స్థానిక నేత‌లేన‌ని టీడీపీ గుర్తించింది. మొత్తంగా. . ఆయా నేత‌ల‌ను స‌రైన గాడిలో పెట్టాల‌ని నాయ‌కులు కోరుతున్నారు.  ప్ర‌స్తుతం ఈ విష‌యం జ‌న‌సేన‌, టీడీపీల్లో హాట్ టాపిక్‌గా మారింది.