Political News

మ‌హిళా ఓటు బ్యాంకు కూడా కూట‌మిదేనా?

మ‌హిళా ఓటు బ్యాంకుపై వైసీపీ ఆది నుంచి ఆశ‌లు పెట్టుకుంది. మ‌హిళ‌ల సెంట్రిక్‌గా పెద్ద ఎత్తున ప‌థ‌కాలు అమ‌లు చేశామ‌ని చెప్పుకొనే వైసీపీ.. ఆదిశ‌గానే అడుగులు వేసింది. కానీ, ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌ను వైసీపీ మెప్పించ‌లేక పోయింది. పైగా.. టీడీపీ, జ‌న‌సేన‌, కూట‌మి త‌ర‌ఫున పోటీ చేసిన మ‌హిళా నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకుని వైసీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీకి మ‌హిళా ఓటు బ్యాంకు కూడా దూర‌మైంద‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ వ్యూహాత్మ‌కం: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు అద్భుతమైన పనితీరు కనబరిచి చారిత్రాత్మక విజయాలను సాధించారు. పార్టీ నాయకత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. టికెట్ల కేటాయింపులోనే మహిళలకు పెద్దపీట వేసింది. దానికి తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో వారు భారీ మెజారిటీలతో విజయకే తనం ఎగురవేశారు. నాయకత్వ పదవుల్లో 62% మంది మహిళలే ఉన్నారు.

టీడీపీ సాధించిన పట్టణ స్థానిక సంస్థల నాయకత్వ స్థానాల్లో(మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్) ఏకంగా 62 శాతం స్థానాలను మహిళా నేతలే కైవసం చేసుకున్నారు. ఇది చట్టబద్ధమైన 33% రిజర్వేషన్ కోటా కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఇక‌, మేయర్ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గెలుచుకున్న 8 మున్సిపల్ కార్పొరేషన్లలోని ఎనిమిది మేయర్ స్థానాలనూ మహిళా నేతలే దక్కించుకున్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్‌లుగా రికార్డు విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 33 మున్సిపాలిటీలకు టీడీపీ మహిళా నేతలు చైర్‌పర్సన్‌లుగా ఎన్నికై మున్సిపల్ పాలనలో సరికొత్త రికార్డు సృష్టించారు. డాక్టర్ ముక్కా శ్రావణి: రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన గ్రేటర్ విశాఖపట్నం మేయర్‌గా ఘనవిజయం సాధించారు.

అవనాపు భార్గవి: విజయనగరం కార్పొరేషన్ మేయర్ స్థానంలో తన సమీప వైసీపీ అభ్య‌ర్థిపై 18,787 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

కె. లక్ష్మీ అపర్ణ.. గుంటూరు కార్పొరేషన్ మేయర్‌గా ఘన విజయాన్ని అందుకున్నారు. షేక్ అబ్దుల్ అబిదా: మచిలీపట్నం మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి భార్య ప‌ద్మావ‌తి నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానంలో తన తోడికోడలు వైసీపీ అభ్యర్థి పై పోటీ చేసి విజయం సాధించారు. కర్నూలు నుంచి బి.వి. ప్రత్యూష, ఒంగోలు నుంచి శ్రీ శిల్ప, కడప నుంచి ఎం. సువర్ణ, చిత్తూరు నుంచి కఠారి హేమలత మేయర్లుగా విజయఢంకా మోగించారు.

This post was last modified on November 7, 2026 9:36 am

Share

Recent Posts

యష్ తీసుకున్న నిర్ణయం సరైనదే

కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో యష్ ఒప్పుకున్న సినిమాలు రెండు. టాక్సిక్ ఏమయ్యిందో తెలిసిందే. అర్థం…

1 hour ago

ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలా మెరుస్తున్న త్రిష

చిన్న చిన్న క్యారెక్టర్లతో తమిళంలో తన కెరీర్‌ను మొదలుపెట్టిన త్రిష.. ఆ తర్వాత ఎంతో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ముఖ్యంగా…

2 hours ago

పాతికేళ్ల వివాదాన్ని వదిలిపెట్టని కమల్

కమల్ హాసన్ కొత్త సినిమా సండియార్ నిన్న అధికారికంగా ప్రకటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రివెంజ్ ఇంటెన్స్…

2 hours ago

ఇద్దరు మిత్రులు ఇవ్వబోతున్న సర్ప్రైజులేంటి

డిసెంబర్ లో ప్రారంభం కాబోతున్న చిరంజీవి టాక్ షో మెగావర్స్ షూటింగ్ ఆర్టిస్టుల డేట్లను బట్టి నిర్విరామంగా జరిగిపోతోంది. బ్రహ్మానందం…

4 hours ago

జడ్పీ చైర్మన్ పంపకాలు ఖరారు?

స్థానిక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా వున్న కూటమి పార్టీల మధ్య జడ్పీ చైర్మన్ స్థానాల విషయం ఫైనల్ అయినట్లు సమాచారం.…

4 hours ago

రామాయణ ఎక్కడిదాకా దూసుకెళ్తుంది

బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ ఊపిరొచ్చింది. వందల కోట్ల వసూళ్లు తెచ్చే బ్లాక్ బస్టర్ కోసం కళ్ళు కాయలు కాచేలా…

4 hours ago