ఓటు బ్యాంకు విషయంలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పోల్చితే.. రాయల సీమలోనే ఎక్కువగా ఓటర్లు పోటెత్తారు. నిజానికి సీమలోని కడప, చిత్తూరు, కర్నూలులో స్థానిక, జడ్పీ ఎన్నికలకు ముందు.. ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ఓటర్లు భయ భ్రాంతులకు గురవుతారని.. ఓటింగ్ శాతం తగ్గిపోతుందని.. తద్వారా తమ కంచుకోటలు బదాబదలు అవుతాయని వైసీపీ అంచనా వేసుకుంది. దీంతో ఆయా స్టేషన్లలో రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేసింది. దీనికి హైకోర్టు ససేమిరా అంది. ఫలితంగా స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్విఘ్నంగా పూర్తయింది.
అయితే.. ఓటు బ్యాంకు తక్కువగా ఉంటుందని భావించిన సీమలోనే స్థానిక ఎన్నికల్లో 60 శాతం మేరకు ఓట్లు పడ్డాయి. ఇక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తారు. ఇది కూడా.. ఆయా ప్రాంతాల మధ్య జరిగిన ఓటింగ్‌తో పోల్చుకుంటే సీమలోనే 72 శాతం మేరకు ఓటింగ్ జరిగింది. ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నా.. ఇక్కడే ఎక్కువగా ఓట్లు కురిశాయి. ఇది వైసీపీకి కలిసి వచ్చే పరిణామమని అందరూ అనుకున్నారు. కానీ, తీరా ఫలితాలు చూస్తే.. ఓట్లు పడినా.. వైసీపీ గ్రాఫ్ అయితే పెరగలేదు.
కీలకమైన కడప, కర్నూలు, అనంతపురంలోనూ .. టీడీపీ కూటమి ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఓట్లు పడ్డాయి కానీ.. అవి వైసీపీకి పడకపోవడం గమనార్హం. అంటే.. సీమలో తమకు కంచుకోటగా ఉన్న కడప.. కర్నూలు జిల్లాల్లో కూడా వైసీపీ ఘోరంగా గ్రాఫ్‌ను కోల్పోయింది. ఓట్లు పడని ప్రాంతాల్లో మాత్రం కొంత ప్రభావం కనిపించింది. అంటే .. ఇది ఓటు బ్యాంకు కంటే కూడా.. పార్టీ విధి విధినాలు.. పార్టీ అనుసరిస్తున్న తీరు.. అధినేత వైఖరి వంటివాటిని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాదు.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు కూడా.. ఈ ఎన్నికలను ప్రభావితం చేశాయని అంటున్నారు. ఉదాహరణకు కమలాపురం నియోజకవర్గం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కంచుకోట. కానీ, ఆయనతో విభేదిస్తున్న నాయకులు పరోక్షంగా ఇక్కడ కూటమికి అనుకూలంగా వ్యవహరించారు. కడపలో ఏకంగా.. జగన్ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకమయ్యాయన్న వార్తలు వస్తున్నాయి. ఫలితంగా ఓటింగ్ పెరిగినంత మాత్రాన వైసీపీ విజయం దక్కించుకుంటుందన్న వాదనను ఈ నియోజకవర్గాలు పటాపంచలు చేశాయి. సో.. ఈ ఫలితాలను బట్టి.. వైసీపీకి కావాల్సింది.. సమన్వయం.. కుమ్ములాటలు లేని నాయకత్వం అన్నది స్పష్టమైందని అంటున్నారు.
This post was last modified on November 7, 2026 8:54 am
కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో యష్ ఒప్పుకున్న సినిమాలు రెండు. టాక్సిక్ ఏమయ్యిందో తెలిసిందే. అర్థం…
చిన్న చిన్న క్యారెక్టర్లతో తమిళంలో తన కెరీర్‌ను మొదలుపెట్టిన త్రిష.. ఆ తర్వాత ఎంతో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ముఖ్యంగా…
కమల్ హాసన్ కొత్త సినిమా సండియార్ నిన్న అధికారికంగా ప్రకటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రివెంజ్ ఇంటెన్స్…
డిసెంబర్ లో ప్రారంభం కాబోతున్న చిరంజీవి టాక్ షో మెగావర్స్ షూటింగ్ ఆర్టిస్టుల డేట్లను బట్టి నిర్విరామంగా జరిగిపోతోంది. బ్రహ్మానందం…
స్థానిక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా వున్న కూటమి పార్టీల మధ్య జడ్పీ చైర్మన్ స్థానాల విషయం ఫైనల్ అయినట్లు సమాచారం.…
బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ ఊపిరొచ్చింది. వందల కోట్ల వసూళ్లు తెచ్చే బ్లాక్ బస్టర్ కోసం కళ్ళు కాయలు కాచేలా…