Movie News

ధనుష్ వెనుక ఆ పార్టీ లేనట్టేనా?

తమిళంలో స్వశక్తితో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయకుడు ధనుష్. నటుడిగా అతడికి బహు భాషల్లో మంచి గుర్తింపు ఉంది. హిందీ, తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేసి ఇక్కడి వాళ్లను మెప్పించడమే కాక.. ఒక హాలీవుడ్ సినిమాలోనూ నటించి తన ప్రత్యేకతను చాటుకున్నాడతను. దళపతి విజయ్ సినీ ఇండస్ట్రీని వదిలేయగా.. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ పెద్ద రేంజికి వెళ్లాలని ప్రయత్నిస్తున్న హీరోల్లో అతను కూడా ఒకడు. అంతే కాక విజయ్ బాటలో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టాలని అతను చూస్తున్నాడు. 

2031 అసెంబ్లీ ఎన్నికల్లో ధనుష్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఘన చరిత్ర ఉన్న ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే క్రమ క్రమంగా బలహీనపడేలా కనిపిస్తున్నాయి తప్ప.. అవి పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టి విజయ్‌‌ని ఢీకొట్టాలని ధనుష్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన రాజకీయ అరంగేట్రంపై ధనుష్ ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.

ఐతే ధనుష్ వెనుక భారతీయ జనతా పార్టీ ఉందని, తన రాజకీయ అరంగేట్రానికి ఆ పార్టీనే సన్నాహాలు చేస్తోందని ఇటీవల ఒక ప్రచారం ఊపందుకుంది. తమిళనాట బలపడాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా భాజపాకు పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలో ధనుష్ లాంటి పెద్ద స్టార్‌ను ముందు పెట్టి రాజకీయం చేయాలని బీజేపీ చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కానీ ఈ ప్రచారాన్ని ధనుష్ పరోక్షంగా ఖండించాడు. తాను సొంతంగా పార్టీ పెట్టబోతున్నట్లు అతను సంకేతాలు ఇచ్చాడు. తన కొత్త చిత్రం ‘ఓం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఈ మేరకు స్పష్టతనిచ్చాడు. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరు చుట్టి వస్తుందనే సామెతను గుర్తు చేసిన అతను.. తన వెనుక వాళ్లు ఉన్నారు, వీళ్లు ఉన్నారు అని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. 

తన వెనుక ఇతరులు ఎవ్వరూ లేరని.. తాను ఒక్కడినే వస్తున్నానని.. కానీ తనకు మద్దతుగా ఉన్నది ప్రజలే అని తేల్చేశాడు ధనుష్. దేవుడి ఆశీర్వాదం, ప్రజల మద్దతుతో తనకు అన్నీ మంచే జరుగుతాయని అతను వ్యాఖ్యానించాడు. ధనుష్ సూటిగా చెప్పకపోయినా.. ఈ వ్యాఖ్యలు తన రాజకీయ అరంగేట్రం గురించే అని అర్థమైపోయింది. కాబట్టి ధనుష్ సొంత పార్టీ పెట్టి సోలోగా వస్తాడు తప్పితే.. బీజేపీ సహా ఏ పార్టీలోనూ చేరడని స్పష్టమైపోయింది. ఒకవేళ పార్టీ పెట్టాక అవసరమైతే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే మాత్రం చెప్పలేం.

This post was last modified on November 8, 2026 1:44 am

Share

Recent Posts

పట్టుదలగా ఉండటం మంచిదే కానీ

కాకా గురించి నెలకు కనీసం రెండు మూడుసార్లు పుకార్లు రావడం, వాటిని ఖండిస్తూ ఏదో ఒక రూపంలో జనవరి 13…

18 minutes ago

అనస్వర టైం మొదలవబోతోందా?

మలయాళంలో చాలా చిన్న వయసులో నటిగా గొప్ప పేరు సంపాదించింది అనస్వర రాజన్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’…

28 minutes ago

బొత్స కూతురు ఓడిపోయినా కోడలు గెలిచింది

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ తన రాజకీయ వారుసురాలిగా కూతురు…

2 hours ago

ఇందిరమ్మ ఎమర్జెన్సీ తప్పును ఒప్పుకున్న సోనియా గాంధీ

దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే. 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు సరిగ్గా 21…

3 hours ago

మెగా ఫోన్ పట్టబోతున్న సూపర్ స్టార్

నటులు దర్శకులుగా మారడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. కానీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లు మాత్రం దర్శకత్వం జోలికి వెళ్లడం అరుదు.…

4 hours ago

బొత్స గారు.. వార‌సురాలినీ గెలిపించుకోలేక పోయారే..!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, శాస‌న మండ‌లిలో విపక్ష నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ వార‌సురాలిగా రాజ‌కీయ అరం గేట్రం చేసిన బొత్స…

5 hours ago