అనంతపురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి అనంతపురం జిల్లాలో ఇరు పార్టీల మధ్య కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శల నుంచి దాడుల వరకు లెక్కేలేదు. ఇక, కార్యకర్తలను ఎవరు రెచ్చగొడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే.. తాజాగా ఏం జరిగిందో ఏమో.. తెలియదు కానీ.. జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు-కార్యకర్తలు ఘర్ష ణలకు దిగితే.. నష్టపోయేది వారేనని చెప్పారు. ఒరే నాయకులుగా మేం మేం బాగానే ఉంటాం. మీరెందుకురా గొడవ పడేది అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. గొడవలు పడొద్దంటూ ఆయన సూచించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేసీ ఫ్యామిలీ.. తాడిపత్రిలో 40 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే.
నిన్నటి వరకు కూడా తాడిపత్రిపై జేసీ అజమాయిషీ అందరూ చూశారు. ఏకంగా కార్యకర్తలతో కలిసి పోలీసు స్టేషన్ ముందే.. ఆయన ధర్నాకు దిగారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కారాలు మిరియాలు కూడా నూరుతున్నారు. అలాంటి నాయకుడిలో ఒక్కసారిగా మార్పు రావడం ఏంటనేది ప్రధాన చర్చ. రాజకీయ గొడవల్లో నష్టపోయేది కింది స్థాయి కార్యకర్తలే. మేం ఎప్పుడూ బాగానే ఉంటాం వివాదాలతో కార్యకర్తలే నష్టపోతారు. ఈ విషయం గుర్తించి గొడవల జోలికి వెళ్లవద్దు అని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఎందుకు?
స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ కార్యకర్తలు, ముఖ్యంగా జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకుల నివాసాలపై దాడులు చేశారు. నియోజకవర్గం పరిధిలోని యల్లనూరు, పుట్టూరు, యాడికిలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధుల కార్లు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు.. వారిపై కేసులు నమోదయ్యాయి. సుమారు 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించారని అంటున్నారు.
This post was last modified on November 5, 2026 7:11 pm
తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్యకి గ్యాప్ వచ్చేసింది. కారణం వృషకర్మ. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో కెరీర్ లోనే…
భారతీయ పెళ్లిళ్లలో భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లికి వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేయడం కుటుంబాలు తమ…
వినోదం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకు తెస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బీహార్లో జరిగిన…
ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రూపొందిన ఓమ్ వంద కోట్ల గ్రాస్ దాటేసింది. ఇందులో…
కొన్ని నెలల క్రితం టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కు గురైన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు…
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా కారణంగా కాదు.. సోషల్ మీడియాలో…