స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. ఆ పార్టీ అధిపతి, మాజీ సీఎం జగన్‌కు ఎక్కడో తీవ్రమైన బాధ కలిగినట్టు ఉంది. అందుకే.. మంగళవారం బాగా పొద్దుపోయాక.. ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. దీనిలో కొంత వ్యంగ్యం.. మరికొంత ఆక్రోశం కలగలిపి.. కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. ‘కంగ్రాట్యులేషన్స్ .. టీం సీబీఎన్, పోలీస్, ఎస్ఈసీ’ అని పేర్కొంటూ.. తన ఆవేదనను నిశితంగా వెల్లడించారు.
‘కంగ్రాట్యులేషన్స్ .. టీం సీబీఎన్, పోలీస్, ఎస్ఈసీ’ !
ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం కూడా దక్కకుండా చూసుకోవడం ద్వారా, ఎన్నికల్లో ఎంత అద్భుతంగా గెలవవచ్చో మీరు నిరూపిం చారు!. ప్రతి దశలోనూ ఈ ప్రక్రియను తారుమారు చేశారు: నామినేషన్: అపహరణకు గురైంది!. పరిశీలన: అపహరణకు గురైంది!. అని జగన్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యల ద్వారా ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా జగన్ తన ఆవేదనను వెల్లడించారు. ఎన్నికల్లో తమను పోటీ చేయించకుండా అడ్డుకున్నారన్నది జగన్ తొలినుంచి చెబుతున్నారు. తాజాగా మరోసారి ఆయన ట్వీట్‌లోనూ పేర్కొన్నారు. అలానే హైజాక్(అపహరణ) చేశారన్న వ్యాఖ్యలను కూడా కొత్తగా చెప్పిందేమీ కాదు. ఆయన తరచుగా ఇటీవల కాలంలో వ్యాఖ్యానిస్తున్నారు.
సో.. మొత్తంగా వైసీపీ ఓటమితో జగన్ మండిపోయారన్నది స్పష్టమైంది. కానీ, దీనిని ఆయన ప్రత్యక్షంగా వెల్లడించకుండా.. పరోక్షంగా ‘కంగ్రాట్యులేషన్స్ .. టీం సీబీఎన్, పోలీస్, ఎస్ఈసీ’ అంటూ.. వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
This post was last modified on November 4, 2026 2:45 pm
ఏపీలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ…
"ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది కాదు.. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవాలన్నదే ముఖ్యం" అంటూ.. జనసేన అధినేత, ఉప…
రాష్ట్రంలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అయితే కార్పొరేషన్…
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లాంటి మాస్ బ్యాకప్ ఉన్న హీరో సినిమా మూడేళ్లకు పైగా మోక్షం దక్కించుకోకుండా ల్యాబులోనే మగ్గుతూ ఉండటాన్ని…
ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన ఈ నగరానికి ఏమైంది థియేటర్ పరంగా ఆశించిన పెద్ద విజయం అందుకోలేదన్నది వాస్తవం. నిన్న…
సోషల్ మీడియా ప్రపంచంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. యూజర్లను తమ ప్లాట్‌ఫామ్‌పైనే ఎక్కువ సమయం గడిపేలా చేసేందుకు సంస్థలు కొత్త…