Political News

తమిళనాడుకు ప్రత్యేక జెండా కావాలా?

భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత రాష్ట్రాలు వున్నాయి. ఇందులో ఏ రాష్ట్రానికి లేని విధంగా తమిళనాడుకు ప్రత్యేక జెండా కావాలని ఆ రాష్ట్ర మంత్రి డిమాండ్ చేయడం దుమారం రేపుతోంది. మంత్రి వ్యాఖ్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పతాకాన్ని అవమానించడమేనన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ అయితే టీవీకే విభజన రాజకీయాలు చేస్తుందని మండిపడింది. ఇంతకూ మంత్రి అధవ్ అర్జున్ ఏమన్నారంటే…..

జాతీయ త్రివర్ణ పతాకంతో సమానంగా తమిళనాడు రాష్ట్రానికి కూడా ప్రత్యేక జెండా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళ భాష, తమిళ ప్రజల గొప్పతనాన్ని చాటిచెప్పేలా తమిళనాడుకు ప్రత్యేకంగా ఒక రాష్ట్ర జెండాను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.
వచ్చే తమిళనాడు దినోత్సవమైన జులై 18 వ తేదీన, రాష్ట్రాల పునర్విభజన రోజైన నవంబర్ 1న ఈ ప్రత్యేక జెండాను ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఏడాది తమిళనాడు దినోత్సవం సందర్బంగా ఈ జెండాను అధికారికంగా ఎగరవేయాలని కోరారు.

అయితే ఈ ప్రత్యేక జెండా డిమాండ్ పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రజలలో విచ్ఛిన్నకర ఆలోచనలను పెంచి పోషించేందుకు టివికె ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ గుర్తింపును, భారతీయ గుర్తింపును విడదీసేలా ప్రయత్నం చేయడం తగదని హితవు పలికారు. జాతీయ పతాకం నీడలో తమిళ గుర్తింపు ఎప్పటికీ చిన్నబోదని స్పష్టం చేశారు. అనవసర వివాదాల జోలికి పోకుండా ప్రజల సమస్యలను పరిష్కరించే ఆలోచనలు చేయాలని సూచించారు.

ఇదిలావుండగా తమిళనాడుకు ప్రత్యేక జెండా కావాలన్న డిమాండ్ ఈ నాడు టీవీకే కొత్తగా చేస్తున్నది కాదని మేధావులు చెబుతున్నారు. 1970లోనే అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తమిళనాడుకు ఒక ప్రత్యేక జెండాను రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించిందని మళ్ళీ ఇప్పుడు టీవీకే ఆ డిమాండ్ ను బయటకు తీసిందని చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్రం కూడా ఇప్పటికే ప్రత్యేక జెండాకు చట్టబద్దత కల్పించడానికి ప్రయత్నం చేస్తోంది. దీనినిబట్టి చూస్తే రానున్న రోజుల్లో మరికొన్ని రాష్ట్రాలు జెండా రాజకీయాలు మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదని జనాలు చెబుతున్నారు.

This post was last modified on November 3, 2026 10:26 am

Share

Recent Posts

48 ఏళ్లుగా నీళ్లు కాకుండా కోకాకోలా తాగి బతుకుంటున్నారా?

ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వారెన్ బఫెట్ పేరు వినగానే ఆయన పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాలే గుర్తుకొస్తాయి. ఎన్నో…

17 minutes ago

స్విమ్మింగ్ పూల్‌లో దిగితే షాక్.. ఇద్దరు మృతి

విహారయాత్రకు వెళ్లినా, ఖరీదైన హోటల్‌లో బస చేసినా అక్కడి సౌకర్యాలు, భద్రతపై అతిథులు నమ్మకంతో ఉంటారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్‌లో…

18 minutes ago

నేను ఒక్క సిగ్నల్ ఇస్తే… బిగ్-బి వార్నింగ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ చాలా ప్రశాంతచిత్తంతో కనిపించే వ్యక్తి. పబ్లిక్ ఫాట్ ఫామ్స్‌లో ఆయనకు ఆగ్రహం రావడం…

42 minutes ago

టార్గెట్ తెలంగాణ: బీజేపీ పెద్ద‌ల వ్యూహం ఏంటి?

బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. తాజాగా తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న వెనుక పెద్ద…

47 minutes ago

మ‌మిత అస‌లు పేరు అది కాదా?

మ‌మిత బైజు.. ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ సినిమాలో ఒక సంచ‌లనం. కొన్నేళ్ల ముందు ప్రేమ‌లు సినిమాతో మ‌ల‌యాళీల‌తో పాటు ఇత‌ర…

1 hour ago

జగన్ కు ఎవరైనా చెబితే బాగుండు

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు…

2 hours ago