Movie News

‘దర్శకుడు’ హీరో.. నిర్మాత అయ్యాడు

అగ్ర దర్శకుడు సుకుమార్ కుటుంబం నుంచి ఇప్పటికే ఆయన భార్య తబిత సుకుమార్ నిర్మాతగా ఉన్నారు. ఆయన ప్రొడక్షన్లో ఆల్రెడీ ‘ఇడుపు కాయితం’ అనే సినిమా తెరకెక్కింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఇటీవలే తబిత నిర్మాణంలో మరో సినిమా మొదలైంది. ఇప్పుడు సుకుమార్ కుటుంబం నుంచి మరో నిర్మాత పరిచయం అవుతుండడం విశేషం. అతనే.. అశోక్ బండ్రెడ్డి. ఈ పేరు ప్రేక్షకులకు ఆల్రెడీ పరిచయమే. కొన్నేళ్ల ముందు సుకుమార్ మిత్రుడైన హరిప్రసాద్ జక్కా రూపొందించిన ‘దర్శకుడు’ సినిమాతో అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో అతను నటుడిగా ప్రయత్నాలు చేయలేదు. కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘థీ స్టోరీస్’ అనే బేనర్‌లో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. సుకుమార్, వంశీ నందిపాటిలతో కలిసి అతను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమానే.. కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం మొదలైన ‘రికార్డ్’. 

ఈ చిత్రంతో సుకుమార్ అసిస్టెంట్ వీరా కోగటం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వీరా మీడియా బ్యాగ్రౌండ్ నుంచి రావడం విశేషం. అతను దాదాపు రెండు దశాబ్దాల పాటు ‘ఈనాడు’ దిన పత్రికలో వివిధ హోదాల్లో పని చేశాడు. జర్నలిజం అనుభవంతోనే కర్నూలు నేపథ్యంలో ఒక రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ కథ రాసి సుకుమార్‌తో పాటు కిరణ్ అబ్బవరంను మెప్పించి ‘రికార్డ్’ సినిమాను పట్టాలెక్కించాడు. వీర ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలకు రచనా విభాగంలో కీలక పాత్ర పోషించాడు. రామ్ చరణ్‌తో సుకుమార్ తీయబోయే కొత్త చిత్రానికి కూడా వీరా రచనా సహకారం అందించాడు. 

సుకుమార్ శిష్యుల్లో బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు, పల్నాటి సూర్యప్రతాప్ లాంటి దర్శకులు తమ ప్రతిభను చాటుకున్నారు. వీరా కూడా దర్శకుడిగా గట్టిగానే కొట్టబోతున్నాడని ‘రికార్డ్’ స్క్రిప్టు గురించి తెలిసిన వాళ్లు చెబుతున్న మాట. స్వయంగా తాను నిర్మాణ భాగస్వామి కావడంతో పాటు తన అన్న కొడుకును కూడా సుకుమార్ నిర్మాతగా పరిచయం చేస్తున్నాడంటే సుకుమార్‌కు తన శిష్యుడి మీద, అతడి కథ మీద ఉన్న గురి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on November 23, 2026 5:53 pm

Share

Recent Posts

అమెరికాలో ఆయన అరెస్ట్.. ఇక్కడ రంగంలోకి చిన్మయి

కర్నాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వయొలెన్ విధ్వాంసుడు హెచ్.ఎన్.భాస్కర్ అమెరికాలో అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ అయింది…

9 minutes ago

‘ట్రబుల్’ గాయాలు మానుతాయా?

తెలుగులో నేరుగా సినిమా చేయడానికి ముందే మన దగ్గర మంచి ఫాలోయింగ్ సంపాదించిన మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. అతను…

1 hour ago

ఏఐ ముందుకు వెళ్తే… మనం వెనక్కి వెళ్లాల్సిందే..

సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న మార్పులు రోజురోజుకూ వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటివరకు మనుషుల మేధస్సు, అనుభవం అవసరమైన అనేక…

3 hours ago

రంగా వార‌సుడిగా కంటే… రాధాగా ముద్ర వేస్తారా?!

విజ‌య‌వాడ మేయ‌ర్‌గా జ‌న‌సేన నాయ‌కుడు, వంగ‌వీటి రాధాకృష్ణన్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు మ‌రో 86 మంది కార్పొరేట‌ర్లు…

3 hours ago

బుల్లితెర దేవరకు మోక్షం దొరికింది

జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా హీరో, ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమాగా దేవర ఎంత సంచలనం…

4 hours ago

24 ఏళ్ళకే డిప్యూటీ మేయర్… ఒంగోలులో చర్పిత రికార్డ్

నిన్నా మొన్నటి వరకు బ్యాగు భుజాన వేసుకొని కాలేజీకి వెళ్లిన ఆమె ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ప్రజా జీవితంలోకి…

4 hours ago