తెలంగాణలో పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక ప్రశ్నలు సంధించారు. ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారని.. సర్ ద్వారా ఓట్లు తొలగించి ప్రధాని పీఠాన్ని పదే పదే ఎక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓట్ బచావో కార్యక్రమంలో విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలో సోమవారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్‌షా ఆయా అంశాలను ప్రస్తావిస్తూ..రేవంత్‌రెడ్డిపై ఫైరయ్యారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేసే అధికారంలోకి వచ్చారా? అని ప్రశ్నించారు.
బీజేపీ సారథ్యంలో మహాపాదయాత్ర నిర్వహించిన అనంతరం.. ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ బచావో(ఓటును రక్షించండి) కార్యక్రమం ఓటర్ల కోసం కాదని.. అది చొరబాటు దారులను కాపాడేందుకు తీసుకున్న కార్యక్రమమని విమర్శించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాందీ ఇద్దరిదీ ఒకే తరహా మనస్తత్వమని వ్యాఖ్యానించారు. వారు ఎంత ప్రయత్నిం చినా.. ఎన్ని ఉద్యమాలు చేసినా.. చొరబాటు దారులకు ఓటు హక్కు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.
సర్ లేనప్పుడూ గెలిచాం..
సర్ ప్రక్రియ కారణంగానే బీజేపీ సహా మోడీ గెలుస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను షా తిప్పికొట్టారు. సర్ ప్రక్రియతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. అది కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టే నిరంతర ప్రక్రియగా చెప్పారు. అయినా.. సర్ ప్రక్రియతో తమకు, గెలుపు ఓటములకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 2014, 2019లో సర్ ప్రక్రియ ఉందా? అని ప్రశ్నించారు. అది లేకపోయినా.. రెండు సార్లు దేశంలో మోడీ గెలిచారని గుర్తు చేశారు. అలా అయితే.. రేవంత్ రెడ్డి కూడా సర్ ప్రక్రియను అడ్డు పెట్టుకునే గెలిచారని అనుకోవచ్చా? అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? అని నిలదీశారు.
సర్ ఉంటుంది!
ఇక, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సర్ ప్రక్రియను అమిత్ షా సమర్థించారు. దేశంలో చొరబాటు దారుల ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 3 కోట్లకు పైగా ఓట్లు చొరబాటు దారులవేనన్నారు. అలానే ఇప్పటికే మృతి చెందిన వారి ఓట్లనుకూడా తీసేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అని నిలదీశారు. ఓటరు జాబితాలను ప్రక్షాళన చేయాలని.. నకిలీలకు ఓటు హక్కు కల్పించలేమని వ్యాఖ్యానించారు.
దేనిపైనైనా చర్చకు రెడీ
కాంగ్రెస్ పార్టీ మాక్ పార్లమెంటు సమావేశాలకే పరిమితం అవుతోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. వాస్తవ సమావేశాలకు వస్తే.. ఏ అంశంపై నైనా చర్చించేందుకు తాము రెడీ అని అన్నారు. ఈవీఎంలు, సర్ ప్రక్రియలపై పార్లమెంటులో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా మన్నారు. ఈవీఎంలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఇక, తెలంగాణలో బీజేపీ సర్కారును ఏర్పాటు చేసేందుకు నాయకులు , కార్యకర్తలు శపథం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నులను రాహుల్‌కు దోచిపెడుతున్నారని విమర్శించారు.
This post was last modified on November 2, 2026 10:54 pm
నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…
రష్మిక మందన్నా కెరీర్లో ఎక్కువగా స్టార్ హీరోల సరసన కథానాయికగానే నటించింది. ఈ మధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…
ఏ ఇద్దరు నేతలు కలిసినా.. ఏ ఇద్దరు నాయకులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…
సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కాల పరిమితి తీరిపోయిన నేపథ్యంలో కొత్తగా పాలక మండలిని ఏర్పాటు…
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…