Political News

ఏపీలో మునిసిప‌ల్ పోలింగ్ ఎందుకు త‌గ్గింది… రీజ‌నేంటి?

ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఏ ఇద్ద‌రు నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చ‌ర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా ఆదివారం జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం భారీగా త‌గ్గుముఖం ప‌ట్టింది. రెండున్న‌రేళ్ల కింద‌ట 2024లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దాదాపు 80 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైంది. దాంతో పోలిస్తే.. ఇప్పుడు స‌గ‌టున 51 శాతానికి మించి పోలింగ్ న‌మోదు కాలేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న‌ కూట‌మి పార్టీలు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న విశాఖ‌, తిరుప‌తి, విజ‌య‌వాడ వంటి కీల‌క మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో స‌గ‌టు 46 శాత‌మే కావ‌డంతో ఆయా పార్టీలు సైతం అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డాయి.

ఇక‌, పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నాటి నుంచి అల్ల‌ర్లు, ఘ‌ర్ష‌ణ‌లు, దాడుల‌తో ఉక్కిరి బిక్కిరి అయిన క‌డ‌ప‌, చిత్తూరు, అన్న‌మ‌య్య వంటి జిల్లాల్లో మునిసిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ స‌గ‌టున 60 శాతం న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఎంతో ప్ర‌శాంతంగా ఉన్న విశాఖ‌, విజ‌య‌వాడ‌ల్లో పోలింగ్ శాతం భారీగా త‌గ్గ‌డం మ‌రో చిత్రం. కూట‌మి పార్టీల‌కు ఎంతో అనుకూలంగా ఉన్న క‌ర్నూలులో 53 శాతం, రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రం ఉన్న‌ గుంటూరులో 56 శాతం కూడా దాట‌క పోవ‌డం వంటివి చ‌ర్చకు వ‌స్తున్నాయి. దీంతో ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధ‌వ్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు అర్ధ‌రాత్రి వ‌ర‌కు పార్టీ నాయ‌క‌ల‌తో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది.

కార‌ణాలు ఏంటి?

స‌హ‌జంగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కంటే కూడా స్థానికంగా జ‌రిగే ఎన్నిక‌ల‌కు పోలింగ్ శాతం ఎక్కువ‌గా న‌మోద‌వుతుంది. గ‌త 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 79 శాతం మేర‌కు పోలింగ్ న‌మోదైంది. దాంతో పోల్చుకున్నా..స‌గ‌టు ఇప్పుడు 20 శాతం మేర‌కు త‌గ్గిపోవడం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌పై కార‌ణాలు అన్వేషించే ప‌నిలో పార్టీలు ఉన్నాయి. ప్రాథ‌మికంగా చాలా వ‌ర‌కు జిల్లాల్లో చివ‌రి నిమిషం వ‌ర‌కు రెబ‌ల్స్ వెంటాడ‌డం ఓట‌ర్ల‌ను క‌న్ఫ్యూజ్‌కు గురి చేసింద‌న‌డంలో సందేహం లేదు. ఒకే పార్టీ నుంచి ఇద్ద‌రు, ముగ్గురేసి నాయ‌కులు కూడా బ‌రిలో నిలిచారు. ఫ‌లితంగా ఓట‌ర్ల‌కు ఎవ‌రిని ఎంపిక చేసుకోవాల‌న్న‌ది సందేహంగా మారి అది పోలింగ్‌పై ప్ర‌భావం చూపించింద‌న్న చ‌ర్చ ఉంది.

ఇది పార్టీలు అంత‌ర్గ‌తంగా తేల్చుకోవాల్సిన విష‌యం. ఇక‌, రెండో విష‌యం తుఫాను ప్ర‌భావం. ఆర్న‌బ్ తుఫాను ప్ర‌భావం కార‌ణంగా.. చాలా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు పోలింగ్‌పై కంటే కూడా.. త‌మ కుటుంబాల బాగోగులపైనే ఎక్కువ‌గా శ్ర‌ద్ధ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో మ‌రో తుఫాను గండం కూడా పొంచి ఉంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ ప్ర‌భావం కూడా.. ఎన్నిక‌ల‌పై ప‌డింద‌ని అంటున్నారు. మొత్తంగా పోలింగ్ శాతం త‌గ్గ‌డం వెనుక మ‌రిన్ని కార‌ణాలు ఉన్నాయ‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. ప‌లు చోట్ల ఓట‌ర్లు క్యూలో ఉన్న నేప‌థ్యంలో రాత్రి ఏడు గంట‌ల వ‌ర‌కు కూడా పోలింగ్‌కు అనుమ‌తించారు. మ‌హిళ‌లే ఈ ద‌ఫా కూడా భారీగా త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

This post was last modified on November 2, 2026 10:30 pm

Share

Recent Posts

అమ్మా… నాన్న…. ఓ బుడ్డోడు

సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…

27 minutes ago

రెండు నెల‌ల వ‌రకు టీటీడీ బోర్డు లేన‌ట్టే..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క మండ‌లి కాల ప‌రిమితి తీరిపోయిన నేప‌థ్యంలో కొత్త‌గా పాల‌క మండ‌లిని ఏర్పాటు…

37 minutes ago

చరణ్, సుకుమార్ సినిమా… సిల్లీ డిస్కషన్లు

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…

49 minutes ago

ఢిల్లీ హోటల్ లో కాంగ్రెస్ మంత్రి vs ఎమ్మెల్యే?

భారత దేశంలో గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ కి గతమంతా ఘనం. అయితే, కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ…

60 minutes ago

ఫేక్ వీడియోలపై అమిత్ షాను కలిసిన చిరు, చరణ్

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా AI,…

1 hour ago

గురూజీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు?

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప రైటర్లలో త్రివిక్రమ్ ఒకడు. దర్శకుడిగా కూడా ఆయన గొప్ప స్థాయినే అందుకున్నాడు. రెండు దశాబ్దాలుగా…

1 hour ago