Political News

అమ్మా… నాన్న…. ఓ బుడ్డోడు

సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ ఆ బిడ్డను ప్రాణంగా పెంచుకోసాగారు. అయితే దంపతుల సంతోషం చూసి కన్నుకుట్టిన కొందరు నికృష్టులు చట్టబద్దంగా దత్తత తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. అదేదో పెద్ద ఘోరం జరిగిపోయినట్లు చైల్డ్ కేర్ అధికారులు రంగంలోకి దిగి ఆ చిన్నారిని తల్లిదండ్రుల నుంచి విడతీసి శిషు సంక్షేమ కేంద్రానికి తరలించడం వివాదంగా మారింది.

తెలంగాణాలోని జగిత్యాలకు సరిత, శ్రీనివాస్ దంపతులకు పెళ్ళై ఏళ్ళు గడిచినా పిల్లలు పుట్టలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగి అలసిపోయిన ఆ దంపతులు ఒక చిన్నారిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బిడ్డ పుట్టిన ఐదు రోజులకే ఓ తల్లి కన్ను మూసిందని తెలుసుకొన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి హిందూ సంప్రదాయం ప్రకారం పసి బిడ్డను దత్తత తీసుకున్నారు. ఇది జరిగి మూడేళ్లవుతోంది.

ఈ మూడేళ్లుగా ఆ బిడ్డను తమ కన్నబిడ్డగా పెంచుకోసాగారు. ఐదు రోజుల బిడ్డకు తల్లిగా మారిన సరిత ఆలనా పాలనా చూసుకుంది. ఆ బుడ్డోడు నవ్వితే నవ్వింది. ఏడిస్తే ఏమైందోనని ఆందోళనతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ బిడ్డతో నాన్న హోదా పొందిన శ్రీనివాస్ ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. అయితే ఆ దంపతుల సంతోషం చూసిన ఇరుగు పొరుగులోని ఒకరు చైల్డ్ కేర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం బిడ్డను దత్తత తీసుకోకుండా పిల్లాడిని తెచ్చుకున్నారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు మూడేళ్ల చిన్నారిని బలవంతంగా తీసుకొని వెళ్లిపోయారు. సరిత, శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకొని వేడుకున్నా వినలేదు. చిన్నారిని శిషు సంరక్షణ కేంద్రంలో విడిచిపెట్టారు.

చిన్నారి లేని జీవితాన్ని ఊహించని సరిత, శ్రీనివాస్ లు అధికారుల వద్దకు వెళ్లి కాళ్ళా వేళ్ళా పడ్డారు. అయినా అధికారుల హృదయం కరగలేదు. చట్టం, న్యాయం అంటూ నీతులు వల్లించారు. దాంతో ఆ దంపతులు బిడ్డ కోసం న్యాయ పోరాటానికి దిగారు. తమ బిడ్డను తమకు అప్పగించాలంటూ హై కోర్టును ఆశ్రయించారు. హిందూ సంప్రదాయం ప్రకారమే తాము ఆ చిన్నారిని దత్తత తీసుకున్నామని, అప్పటి నుంచి చిన్నారిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నామని వివరించారు. దాంతో చిన్నారిని తిరిగి దంపతులకు అప్పగించాలని అక్టోబర్ 16వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పటివరకు రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మాట్లాడిన అధికారులు ఇప్పుడు వాటిని అటకెక్కించారు. రూల్స్ గీల్స్ జాంతానై అంటూ జవాబిచ్చారు. అయితే బిడ్డను వెదుక్కుంటూ శిషు సంక్షేమ కేంద్రానికి వెళ్లిన శ్రీనివాస్, సరితలను చూసిన చిన్నారి ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. అమ్మా నాకు భయం వేస్తుంది. నన్ను తీసుకెళ్ళమంటూ గుక్కపట్టి రోదించడం మొదలుపెట్టాడు. బిడ్డ ఏడుపు చూసిన సరిత, శ్రీనివాస్ లు కూడా కన్నీరు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు అధికారుల తీరు మీద అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డారు. తల్లీ బిడ్డలను విడదీసే ఈ రూల్స్ ని పక్కన పడేసి బిడ్డను ఆ దంపతులకు అప్పగించాలని కోరారు.

మొత్తం మీద ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే రంగంలోకి దిగిన కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆ బిడ్డను సరిత, శ్రీనివాస్ లకు అప్పగించాల్సిందిగా ఆదేశించారు. హై కోర్టు ఉత్తర్వుల మేరకు బిడ్డను తలిదండ్రులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనలో తల్లీదండ్రుల ప్రేమే గెలిచిందని జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on November 2, 2026 10:46 pm

Share

Recent Posts

రెండు నెల‌ల వ‌రకు టీటీడీ బోర్డు లేన‌ట్టే..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క మండ‌లి కాల ప‌రిమితి తీరిపోయిన నేప‌థ్యంలో కొత్త‌గా పాల‌క మండ‌లిని ఏర్పాటు…

25 minutes ago

చరణ్, సుకుమార్ సినిమా… సిల్లీ డిస్కషన్లు

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…

37 minutes ago

ఢిల్లీ హోటల్ లో కాంగ్రెస్ మంత్రి vs ఎమ్మెల్యే?

భారత దేశంలో గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ కి గతమంతా ఘనం. అయితే, కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ…

48 minutes ago

ఫేక్ వీడియోలపై అమిత్ షాను కలిసిన చిరు, చరణ్

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా AI,…

1 hour ago

గురూజీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు?

తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప రైటర్లలో త్రివిక్రమ్ ఒకడు. దర్శకుడిగా కూడా ఆయన గొప్ప స్థాయినే అందుకున్నాడు. రెండు దశాబ్దాలుగా…

1 hour ago

బాలిక కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలి

రాప్తాడు జడ్పీ హైస్కూల్లో ఓ బాలికపై ఒక ఉన్మాది పాశవికంగా దాడి చేసిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…

4 hours ago