ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కాల పరిమితి తీరిపోయిన నేపథ్యంలో కొత్తగా పాలక మండలిని ఏర్పాటు చేసే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే.. ప్రభుత్వం తాజాగా రెండు మాసాల వరకు ఈ విషయంపై ఎలాంటి చర్చలకు తావులేకుండా.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల నేతృత్వంలో స్పెసిఫైడ్ కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు మాసాల వరకు నూతన పాలకమండలిని ఏర్పాటు చేసే అవకాశం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక అధికారుల కమిటీ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులు ముద్దాడ రవిచంద్ర, ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే, ప్రభుత్వ కార్యదర్శి,గా ఉన్న వి. వినయ్ చంద్ – సభ్యుడుగా ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ విభాగం ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న కె. కన్నబాబును కూడా మరో సభ్యుడిగా మొత్తం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం ఈ ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ పాలకమండలికి ఉండే అన్ని అధికారాలను వినియోగించడంతో పాటు, పాలకమండలి నిర్వహించాల్సిన అన్ని విధులను నిర్వహిస్తుంది. ఈ ప్రత్యేక అధికారుల కమిటీ ఒక సంవత్సరం పాటు లేదా నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటివరకు కొనసాగుతుంది. అయితే.. పాలక మండలికి ఉన్న అధికారాలు ఉన్నప్పటికీ.. సిఫారసు లేఖలను అనుమతించరు.
కేవలం ప్రొటోకాల్ దర్శనాల వరకు మాత్రమే కమిటీకి అధికారం ఉంటుంది. అలానే పాలక మండలి మాదిరిగా బడ్జెట్‌ను ఆమోదించే అధికారం కానీ.. కొత్తగా కార్యక్రమాలు, నిర్మాణాలు చేపట్టే అవకాశం కానీ ఉండదు. ఇక, టీటీడీలో నియామకాలు కూడా చేపట్టే అధికారం కూడా ఈ కమిటీకి ఉండదు. కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉంటుంది. అలానే.. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేలా ఏర్పాట్లు, సౌకర్యాల మెరుగుదలకు మాత్రమే అధికారం ఉంటుంది. ఏదైనా బడ్జెట్ పరమైన అంశాల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
This post was last modified on November 2, 2026 10:35 pm
నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…
రష్మిక మందన్నా కెరీర్లో ఎక్కువగా స్టార్ హీరోల సరసన కథానాయికగానే నటించింది. ఈ మధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…
తెలంగాణలో పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక…
ఏ ఇద్దరు నేతలు కలిసినా.. ఏ ఇద్దరు నాయకులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…
సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…