Political News

`పెద్దిరెడ్డి` ఇక చేతులెత్తేస్తారా?

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి.. పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తాజాగా జ‌రుగుతున్న ఎన్నికల్లో చేతులు ఎత్తేశారు. కార‌ణాలు ఏవైనా కూడా.. ఆయ‌న నైరాస్యం ప్ర‌ద‌ర్శించారు. దీంతో పుంగ‌నూరు మొత్తం ఇప్పుడు టీడీపీ వ‌శ‌మైపోయింది. ఎన్నిక‌లకు ముందే.. టీడీపీ భారీ ఏక‌గ్రీవాలు సాధించింది. ఒక‌టి రెండు మిన‌హా ఎక్క‌డా పుంగ‌నూరులో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం లేదు. ఇది పెద్దిరెడ్డి నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయాల్లో తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి ఫ్యూచ‌ర్పైనే అనేక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

వాస్త‌వానికి రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు అన్నీ స‌వ్యంగా జ‌రిగిపోవాల‌ని కోరుకోవ‌డం కామ‌నే. కానీ.. ఒక్కక్క సారి ప‌రిస్థితులు ఎదురు తిరిగిన‌ప్పుడు కూడా.. వాటిని త‌ట్టుకుని ముందుకు వెళ్లిన వారే నిల‌బ‌డ‌తారు. ఈ విష‌యంలో పెద్దిరెడ్డికి ఎవ‌రూ పాఠాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆయ‌న అనేక విష‌యాల్లో కాచి వ‌డ‌పోసిన నాయ‌కుడే. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న చేతులు ఎత్తేయ‌డానికి కార‌ణం.. పార్టీపైనే ఆయ‌న‌కు ఆశ‌లు త‌గ్గిపోయాయ‌ని అంటున్నారు. సాధార‌ణంగా పార్టీ బ‌లంగా ఉంటే.. నాయ‌కులుకూడా బ‌లంగా పుంజుకునే ప్ర‌య త్నాలు చేస్తారు.

కానీ.. ప్ర‌స్తుతం వైసీపీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తీరుతెన్నులు ఇబ్బందిగా ఉన్నాయి. ముఖ్యంగా జ‌గ‌న్ ఇమేజ్ కూడా ప‌డిపోతోంది. ఇలాంటి స‌మ‌యంలో తాను ఇంకా పోరాడి.. సాధించేది ఏమి ఉంటుంద‌న్న నిరాశ‌, నిస్పృహ‌లు పెద్దిరెడ్డిలో నెల‌కొన్నాయని తెలుస్తోంది. పైగా.. డ‌బ్బు కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు చేయాలి. అయినా.. ఇవ‌న్నీ చేసినా.. పార్టీ నిల‌బ‌డుతుంద‌న్న న‌మ్మ‌కం కూడా ఆయ‌న‌లో స‌న్న‌గిల్లింది. అందుకే.. తాజా ఎన్నిక‌ల్లో చేతులు ఎత్తేశార‌ని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ..

ఇక‌, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ పెద్దిరెడ్డి పోటీ నుంచి త‌ప్పుకొంటార‌న్న ప్ర‌చారం ఉంది. ఆయ‌న ఈ విష‌యంపై నేరుగా స్పందించ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా జ‌రుపుతున్న చ‌ర్చ‌లు.. ఆయ‌న వ్య‌వ‌హార శైలి వంటివి ప‌రిశీలిస్తే.. పెద్దిరెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ దూరంగానే ఉంటార‌ని.. కేవ‌లం ప‌ర్య‌వేక్ష‌ణ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతార‌ని అనుచ‌రుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో ఒక‌వైపే కాదు.. రెండో వైపు కూడా బ‌లంగా ఉంటుంద‌న్న విష‌యం పెద్దిరెడ్డికి చాలా రోజుల త‌ర్వాత తెలిసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న ఇక‌, ఫుల్ స్టాప్ పెట్టేసిన‌ట్టేన‌న్న చ‌ర్చ పుంగ‌నూరులో ప్ర‌తిచోటా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 1, 2026 6:23 am

Share

Recent Posts

సీతారాముల మీద ఒత్తిడి పెరుగుతోందా

నవంబర్ వచ్చేసింది. నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న రామాయణ సిరీస్ మొదటి భాగం పార్ట్ 1 అయిదో తేదీ…

11 minutes ago

56 ఏళ్ల వ‌య‌సులో ముఖ్య‌మంత్రి ప్రేమ వివాహం

జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి.. ఒమ‌ర్ అబ్దుల్లా తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యసు 56 సంవ‌త్స‌రాలు. గ‌త…

20 minutes ago

సందీప్ వంగాని టార్గెట్ చేయడం రైటేనా

నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని మీద ఒక యువకుడు రంపపు మెషీన్ తో దాడి చేసిన…

51 minutes ago

ప్రయోగం చేయడమే ప్రభావితం చేసిందా

టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ ఏదైనా ఉందంటే వాటిలో మొదటిది స్లాషర్. అంటే మనుషులను కాయగూర…

53 minutes ago

లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం సీఎం సాబ్

తమిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌కు భారీ రాజ‌కీయ సెగ త‌గులుతోంది. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి క‌నీసం ఏడాది కూడా కాకుండానే..…

2 hours ago

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరింత వేగం

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ‌ను రోజువారీగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఆయా కేసుల…

2 hours ago